Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రచారం చేయకుండా 48 గంటలపాటు నిషేధం
న్యూఢిల్లీ : తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం రెండు రోజుల పాటు నిషేధం విధించింది. మునుగోడు ఎన్నికల్లో శనివారం రాత్రి ఏడు గంటల నుంచి రెండు రోజులపాటు ప్రచారం నిర్వహించకూడదని పేర్కొంది. ఈ మేరకు ఈసీ శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య జరుగుతున్న ఎన్నిక కాదనీ, రూ.2,000 పెన్షన్, రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు, రూ.3,000 వికలాంగు పెన్షన్ కొనసాగింపు, ఆగిపోవడం మధ్య జరుగుతున్న ఎన్నికలని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రచారం చేసినట్టు బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై జగదీశ్‌రెడ్డికి ఈసీ నోటీసులిచ్చింది. దీనికి మంత్రి సమాధానమిచ్చారు. కాగా, సమాధానానికి సంతృప్తిచెందని ఈసీ 48 గంటల పాటు నిషేధం విధించింది. మంత్రిగా ఎన్నికల నియమాలు ఉల్లంఘించారు.. ఆర్టికల్ 324 కింద ఆయన ఎన్నికల ప్రచారంపై నిషేధం విధిస్తున్నాం. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటర్వూలు, మీడియా, సోషల్ మీడియాలో మాట్లాడకూడదని ఈసీ తెలిపింది.