Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రాన్ని ప్రశ్నించిన మనీష్ సిసోడియా
ఢిల్లీ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతున్నది. ఈ నేపథ్యంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆపరేషన్ లోటస్ పేరుతో వికృత క్రీడ నడుస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఆపరేషన్ లోటస్ బట్టబయలైందని, రూ.100 కోట్లతో ముగ్గురు దళారులు రెడ్ హ్యాండెడ్గా దొరికారని.. పట్టుబడిన ముగ్గురికి బీజేపీ జాతీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఎమ్మెల్యేలను తీసుకువస్తే డబ్బులు, సెక్యూరిటీ, పదవులు ఇస్తామని ఆఫర్ చేశారని తెలిపారు. సీబీఐ, ఈడీకి భయపడకండి.. మా దగ్గర ఉంటే ఏ భయం ఉండదని హామీ ఇస్తున్నారనీ, ఢిల్లీలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి, మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని సిసోడియా ఆరోపించారు. ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారనీ... ఇందుకు సంబంధించిన డబ్బులు కూడా సిద్ధం అయ్యాయని ఆడియోలో చెప్పారని.. ఆడియోలో బిఎల్ సంతోష్, అమిత్ షా పేరు కూడా చెబుతున్నారని సిసోడియా ఆరోపించారు. అసలు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని.. ఎవరిదని ప్రశ్నించారు. అమిత్షావా..? లేక బిఎల్ సంతోష్ డబ్బులా..? అని అడిగారు. కేంద్రం హోంశాఖ మంత్రిని తప్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.