Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు ప్రారంభం
న్యూఢిల్లీ : సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు కొడియేరి బాలకృష్ణన్‌కు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ ఘన నివాళి అర్పించింది. మూడు రోజుల పాటు జరగబోయే సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాలు శనివారం నాడిక్కడ హరికిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో ప్రారంభమైయ్యాయి. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో తొలుత ఇటీవలి అనారోగ్య రీత్యా మరణించిన సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు కొడియేరి బాలకృష్ణన్‌కు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ నివాళులర్పించింది. ఆయనతో పాటు మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు కుమార్ సిరోల్కర్, కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి ములయం సింగ్ యాదవ్, ఆర్థిక వేత్త అభిజిత్ సేన్, రాజీవ్ ఝా (సీపీఐ(ఎం) హిందీ వార పత్రిక లోక్ లేహర్), హిందీ రచయిత శేఖర్ జోషి, ఆర్ఎస్ఎస్ గూండాలు హత్య చేసిన షాజాహన్ (కేరళ, పాలక్కాడ్)లకు నివాళులర్పిస్తూ కేంద్ర కమిటీ సభ్యులంతా మౌనం పాటించారు. అనంతరం సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను సమావేశం ముందు ఉంచారు. దీనిపై వివిధ రాష్ట్రాల కేంద్ర కమిటీ సభ్యులు చర్చించారు.
ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కరత్, బివి రాఘవులు,బృందా కరత్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సుభాషిణీ అలీ, సూర్యకాంత్ మిశ్రా, జి.రామకృష్ణన్, నీలోత్పల్ బసు, తపన్ సేన్, విజయరాఘవన్, అశోక్ దావలే, రామచంద్ర డోమ్, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు, ఎంఎ గఫూర్, హేమలత, ఎస్.పుణ్యవతి, జి.నాగయ్య, బి.వెంకట్, ఆర్.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.