Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దీపావళి సెలవుల అనంతరం సోమవారం సుప్రీంకోర్టు వివాదాస్పద పౌరసత్వ (సవరణ)చట్టం సహా దాదాపు 240 పిటిషన్లను విచారించనున్నది. ఇందులో చాలా వరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలే కావడం గమనార్హం. ఈ 240 పిటిషన్లలో దాదాపు 232 పిటిషన్లు సీఏఏకి సంబంధించినవే. విశేషమేంటంటే.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, బేల ఎం త్రివేదితో కూడిన ధర్మాసనం మాత్రమే ఈ 232 పిటిషన్లను సోమవారం జాబితా చేసింది. పౌరసత్వ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు త్రిసభ్య ధర్మాసనానికి పంపుతామని గతంలో సీజేఐ యూయూ లలిత్ ధర్మాసనం పేర్కొంది. సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ వచ్చే నెల 8న పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే.
ప్రతీ సూచనను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం : లలిత్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ఆదివారం పశ్చిమ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యూరిడికల్ సైన్సెస్ 14వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లా గ్రాడ్యుయేట్లనుద్దేశించి మాట్లాడారు. ప్రతి సూచనను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, మానవజాతి, సమాజ సంక్షేమం కోసం కరుణతో పనిచేయాలన్నారు.