Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయికి చేరిన వాయు కాలుష్యాన్ని నివారించడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రారు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భవన నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధం విధించారు. అలాగే, రాజధాని, సమీప ప్రాంతాల్లో ముఖ్యంగా వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో నీటిని వెదజల్లే యంత్రాలు, భాష్ప వాయు నిరోధక యంత్రాలను ఏర్పాటు చేసి గాల్లోకి దుమ్ము, దూళి, పొగ చేరకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిర్మాణ, కూల్చివేత పనులపై నిషేధాన్ని పర్యవేక్షించడానికి వివిధ విభాగాల అధికారులతో 586 బృందాలను నియమించారు. దుమ్ము, వాహన కాలుష్యం, పంట వ్యర్థాల దహనం వంటి అంశాలు రాజధానితో పాటు ఉత్తరప్రదేశ్ శివారు జిల్లాల్లోని ప్రాంతాల్లో వాయు కాలుష్యం పెరగడానికి కారణంగా ఉన్నాయి.