Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైపూర్ : బిజెపి ప్రభుత్వ హయాంలోనే బాలికల వేలం ఘటనలు జరిగాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. రాజస్థాన్లోని బిల్వారా జిల్లాలో రుణాల చెల్లింపులు కోసం బాలికలను వేలం వేస్తున్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై గెహ్లాట్ మాట్లాడుతూ 'ఈ సంఘటనలు 2005లో బిజెపి అధికారంలో ఉన్న సమయంలో జరిగాయి. 2019లో వెలుగులోకి వచ్చాయి. 21 మంది నిందితులను అరెస్టు చేశాం' అని గెహ్లాట్ మీడియాకు తెలిపారు.