Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : కర్నాటక హుబ్లికి చెందిన ఓ కాంట్రాక్టర్.. తాను చనిపోయేందుకు అనుమతి కోరారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మరులకు లేఖ రాశాడు. కర్నాటకలో అధికారులు అడిగినంత కమీషన్లు ఇచ్చుకోలేకపోతున్నానని, తనకు మరణమే శరణ్యమని తన లేఖలో పేర్కొన్నారు. తనకు రావాల్సిన బిల్లులను క్లియర్ చేసేందుకు కర్నాటక అధికారులు ఏకంగా 40 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని లేఖలో చెప్పడం కలకలం రేపింది. ఇప్పటికే ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మరు అవినీతిని ఎండగడుతూ అక్కడి వీధుల్లో 'పేసీఎం' పోస్టర్లు వెలిశాయి.