Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేవలం ఎన్నికల కోసమే ఉమ్మడి పౌర స్మతి (యునిఫాం సివిల్ కోడ్ - యూసీసీ) ని అమలు చేస్తామని బీజేపీ ప్రజలను మభ్యపెడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం గుజరాత్లో ఆయన ప్రచారాన్ని వేగవంతం చేశారు. భవనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా యూసీసీ అమలు చేయాల్సి వుందని అన్నారు. కానీ యూసీసీ పేరుతో హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ ఇదే వాగ్దానం చేసిందని, ఎన్నికల్లో విజయం సాధించినా ఇప్పటివరకు యూసీసీని అమలు చేయలేదన్నారు. ఉత్తరాఖండ్‌లో విజయం సాధించిన అనంతరం ఓ కమిటీని నియమించి చేతులు దులుపుకుందని విమర్శించారు. గుజరాత్ ఎన్నికలకు మూడు రోజుల ముందు కూడా ఇదేవిధంగా ఓ కమిటీని ఏర్పాటు చేసిందని... అది కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంటికి వెళుతుందని అన్నారు. బిజెపి అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.