Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాజంలో ఒక వర్గం చేతిలో అధికారాలు
- ఇదే ట్రెండ్ కొనసాగితే ప్రమాదం..: సీజేఐని కోరిన మమతా బెనర్జీ
న్యూఢిల్లీ : సమాజంలో ఒక వర్గం చేతిలో ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్బంధానికి గురవుతున్నాయని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే దేశం రాష్ట్రపతి పాలన దిశగా వెళ్తుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థను కాపాడాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి విజ్ఞప్తి చేశారు. కోల్‌కతాలోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సైన్స్ కాన్వకేషన్ (ఎన్‌యూజేఎస్) కార్యక్రమానికి సీజేఐ యు.యు.లలిత్ హాజరైన క్రమంలో మమతా బెనర్జీ పై వ్యాఖ్యలు చేశారు. ''ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వా మ్యాన్ని కాపాడండి. సమాజంలో ఒక వర్గం ఎవరినైనా దుర్భాషలాడగలరా? వారు ఎవరినైనా నిందించగలరా? సర్, మన గౌరవం దెబ్బతింటోంది. తీర్పు వెలువడేలోపే ఎన్నో జరిగిపోతున్నాయని చెప్పేందుకు చింతిస్తున్నాను. నేను చెప్పేది తప్పు అనుకుంటే..క్షమించండి'' అని మమతా బెనర్జీ అన్నారు. ఎన్‌యూజేఎస్ ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటిగా అభివర్ణించారు ఆమె. ఈ సందర్భంగా సీజేఐ యు.యు.లలిత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మీడియా ఒక వర్గానికి వంత పాడుతోందని, దీనివల్ల ప్రజలు వేధింపులకు గురవుతున్నారని, దీనిని అడ్డుకోకపోతే ప్రజాస్వా మ్యం మరింత దెబ్బతింటుందని సీజేఐకి మమత తెలిపారు. న్యాయ వ్యవస్థ కలుగజేసుకొని దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాలని కోరారు.