Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వెనుక మతలబు ఇదే..
- ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థపై బీజేపీ నమ్మకం లేదు : సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు
న్యూఢిల్లీ : పాంతీయ పార్టీలని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ చూస్తున్నదని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు. తొలుత బీజేపీ, కమ్యూనిస్టు పాలిత ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయాలని చూసిందనీ, ఇప్పుడు తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేలకు డబ్బుతో ఎర వేసిందని విమర్శించారు. గతంలో మహారాష్ట్ర ,కర్నా టకలో ఇదే విధంగా ఫిరాయింపులను చేసిందని దుయ్యబట్టారు
తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ఖండిస్తున్నామని బి.వి రాఘవులు అన్నారు. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశాల్లో తెలంగాణ పరిణామాల పై చర్చించామని చెప్పారు.
అయితే ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థపై బీజేపీకి నమ్మకం లేదనీ, అందువల్లే ఎన్నికల్లో ఎవరు గెలిచినా డబ్బుతో కొనుగోలు చేయాలని భావిస్తోందని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు విమర్శించారు. సోమవారం నాడిక్కడ హరి కిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో బి.వి రాఘవులు మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ బీజేపీ చర్యలను ఖండించాలని, ఎన్నికల ప్రతిష్ట నిలబెట్టేలా పార్టీలు వ్యవహరించాలని పిలుపు ఇచ్చారు. గవర్నర్లు, డబ్బుని వినియోగిస్తూ బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను విచ్ఛిన్నం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని, సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ తీసేలా బీజేపీ వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, ఫెడరల్ వ్యవస్థను కాపాడేందుకు కలిసొచ్చే వారిని సమీకరించి ఉద్యమాన్ని రూపొందించాలని కేంద్ర కమిటి నిర్ణయించిందని తెలిపారు. కేంద్రం ప్రభుత్వ విధానాల వల్ల ప్రజా సమస్యలు, ధరలు పెరుగుతున్నాయని, భవిష్యత్లో ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఉద్యమాలకు సిపిఎం మద్దతు ఇస్తుందని అన్నారు.
ఏపీకి బీజేపీ ద్రోహం
''నవంబర్ 11న ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో ఏపీ సమస్యలపై ప్రకటన చేయాలి. విభజన జరిగిన నాటి నుంచి ఏపీకి బీజేపీ ద్రోహం చేస్తుంది. ప్రత్యేక హౌదా లేదని చెప్పి..తీరని ద్రోహం చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయి వేటీకరణపై ఏడాదిగా ఉద్యమం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని కేంద్రం పట్టించుకోవడం లేదు. రైల్వే జోన్ వల్ల ఉపయోగం లేకుండా చేస్తుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి రాజధాని ఏర్పాటు పరిష్కారం కాదని రాష్ట్ర ప్రభుత్వం గ్రహించాలి. ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి. మోడీ పర్యటనలో ఏపీ సమస్యలపై ఒక ప్రకటన వచ్చేలా అన్ని పార్టీలు కృషి చేయాలి'' అని అన్నారు.