Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీయేతర ప్రభుత్వాలతో చర్చిస్తాం.. : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
న్యూఢిల్లీ: రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల హక్కులపై గవర్నర్ల దాడి చేస్తున్నారనీ, దీనిపై అన్ని బీజేపీ యేతర ప్రభుత్వాలతో చర్చిస్తామని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్ల లేవనెత్తుతున్న సమస్యపై ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. గుజరాత్లో తీగల వంతెన కూలిపోవడంపై స్పందించిన ఏచూరి, ఈ ఘటనలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. అలాగే ఈ ఘటనపై విచారణ జరిపి, కారకులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనీ అందుకు ప్రతి నిమిషం ముఖ్యమని అన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అనేక ప్రశ్నలు ముందుకు వస్తున్నాయనీ, దీనిపై అక్కడి బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫిట్నెస్ సర్టిఫికేట్, ఎంత మందిని అనుమతించాలి, అసలు ఎవరి వైఫల్యం వల్ల ఈ ఘటన జరిగిందో స్పష్టం చేయాలని తెలిపారు.
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యునిగా ఎంవి గోవిందన్
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యునిగా కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ను కేంద్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. హరి కిషన్ సింగ్ సుర్జీత్ భవన్లో మూడు రోజుల పాటు జరిగిన సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సమావేశం సోమవారం ముగిసింది.