Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ కేబుల్ బ్రిడ్జీ దుర్ఘటన
అహ్మదాబాద్ :గుజరాత్లో కేబుల్ బ్రిడ్జీ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 141కి చేరింది. మరో 19 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌కు 200 కి.మీ దూరంలో ఉన్న బ్రిటీష్‌కాలం నాటి ఈ బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టిన గుజరాత్ ప్రభుత్వం ఈ నెల అక్టోబర్ 26న గుజరాతీ న్యూఇయర్ సందర్భంగా తిరిగి ప్రారం భించింది. అయితే ఫిట్నెస్ సర్టిపికేట్ లేకుండానే బ్రిడ్జీని ప్రారంభించినట్టు సమాచారం. ఛాత్ పూజ కోసం సుమారు 500 మంది ఆదివారం సాయం త్రం కేబుల్ బ్రిడ్జీపైకి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా బ్రిడ్జీ కూలి పోవ డంతో వందలాది మంది మచ్చునదిలో పడిపోయారు.
తొమ్మిది మంది అరెస్టు
దేశాన్ని తీవ్రంగా కలచివేసిన గుజరాత్‌లోని మోర్బీ విషాద ఘటనలో అరెస్టులు జరిగాయి. రాష్ట్ర పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. కేబుల్ బ్రిడ్జి కూలిన కొన్ని గంటల తర్వాతే వీరిని అదుపులోకి తీసుకు న్నారు. ముఖ్యంగా, బ్రిడ్జి కాంట్రాక్టర్, మేనేజర్, సెక్యూరిటీ, టికెట్ తీసుకు న్నవారు వీరిలో ఉన్నారు. వీరిని ప్రశ్నించిన తర్వాతే పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ వంతెనను నిర్మిస్తున్న కంపెనీపై నేరపూరిత హత్య కేసును పోలీసులు నమోదు చేశారు. ఐజీపీ ర్యాంకు అధికారి నేతృత్వంలో దర్యాప్తు ను ప్రారంభించామని రాష్ట్ర హౌం మంత్రి హర్ష్ సింఘ్వీ తెలిపారు.