Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన కేసులకు సుప్రీంకోర్టు సోమవారం ఇద్దరు న్యాయవాదులను నోడల్ న్యాయవాదులుగా నియమించింది. సీఏఏ పై దాఖలు అయిన పిటిషన్లను సోమవారం విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదరు ఉమేష్ లలిత్, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేద్లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణ డిసెంబర్ 6కు వాయిదా వేసింది.