Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : తెలంగాణకు చెందిన 11 మంది పోలీసులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఆపరేషన్ పతకాలు వరించాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని ఉగ్రవాద వ్యతిరేక పోరు, సరిహద్దుల్లో పోరా టం, ఆయుధాల నియంత్రణ, నార్కోటిక్స్ అక్రమ రవాణాను అరి కట్టడం, ప్రమాద సమయాల్లో చేయూత కార్యక్రమాల్లో పకడ్బందీ వ్యూహంతో వ్యవహ రించి సమాజ విశాల ప్రయోజనాలకు ఉపయుక్తంగా నిలిచిన పోలీసు బృం దాలకు కేంద్ర హౌం శాఖ ఇచ్చే ప్రత్యేక ఆపరేషన్ పతకాలను సోమ వారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా కేవలం ఐదు రాష్ట్రాల పోలీసులకే దక్కిన ఈ పతకాల్లో తెలంగాణకు చెందిన 11 మందికి పతకాలు వరించాయి. తెలంగా ణ నుంచి పతకాలు దక్కించుకున్న వారిలో అనిల్ కుమార్ (ఏడీజీపీ), కైత రవీందర్ రెడ్డి (డిప్యూటీ ఎస్పీ), మొగుళ్ల వెంకటేశ్వర్ గౌడ్ (ఇన్స్పెక్టర్), కుకు డపు శ్రీనివాసులు (ఎస్సై), మహ్మద్ అక్తరాషా (ఎస్సై), పాండే జితేందర్ ప్రసాద్ (ఎస్సై), సయ్యద్ అబ్దుల్ కరీమ్ (ఎస్సై), శానుగొమ్ముల రాజవర్దన్ రెడ్డి (హెడ్ కానిస్టేబుల్), మహ్మద్ తాజ్ పాషా (కానిస్టేబుల్), మహ్మద్ ఫరీదు ద్దీన్ (కానిస్టేబుల్), బచ్చుల లక్ష్మీనారాయణ (కానిస్టేబుల్), కొడగల్ కిరణ్ కుమార్ (కానిస్టేబుల్), సయ్యద్ జియా ఉల్ హక్ (కానిస్టేబుల్) తదితరులున్నారు.