Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లో కోటి విలువ జేసే బాండ్లు..116
- 2018 నుంచి ఇప్పటివరకూ బాండ్ల ద్వారా రూ.10,791 కోట్లు
- విరాళాల్లో అత్యధికం బీజేపీకే..
న్యూఢిల్లీ : ఎన్నికల బాండ్ల పథకం బీజేపీకి కనకవర్షం కురిపి స్తోంది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా..ఆ సందర్భాన్ని ఉపయోగిం చుకొని వందల కోట్లు తన జేబులో వేసుకుంటోంది. అక్టోబర్‌లో చేపట్టిన 22వ దఫా ఎన్నికల బాండ్ల కొనుగోళ్ల తో వివిధ రాజకీయ పార్టీలకు రూ. 545కోట్లు విరాళాలుగా అందాయి. ఇందులో 90శాతం బాండ్లు బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ, తృణమూల్ పార్టీల కు అందాయి. కోటి రూపాయలు విలువజేసే బాండ్లు 526 ఉన్నాయని, హైదరాబాద్ నుంచి 116 బాండ్ల కొనుగోలు జరిగిందని ఆర్టీఐ దరఖాస్తు కు ఎస్బీఐ సమాచారాన్ని విడుదల చేసింది. 2018 నుంచి బాండ్ల పథకం అమల్లోకి వచ్చింది. ఇప్పటివరకూ 22 దఫాలుగా బాండ్ల ద్వారా ఆయా రాజకీయ పార్టీలకు రూ.10,791 కోట్లు విరాళాలుగా అందాయి. ఇందు లో అత్యధికంగా అధికార బీజేపీకి వెళ్లాయని గణాంకాలు చెబుతున్నాయి.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఎన్నికల బాండ్ల ద్వారా విరాళాల సేకరణకు మోడీ సర్కార్ పచ్చ జెండా ఊపింది. సామాజిక కార్యకర్త లోకేశ్ కె.బాత్రా పై సమాచా రాన్ని సేకరించారు. తాజాగా చేపట్టిన ఎన్నికల బాండ్లకు సంబంధించి వెలు వడిన సమాచారం ఈ విధంగా ఉంది. ప్రస్తుత (22వ దఫా) బాండ్ల అమ్మకా ల్లో (అక్టోబర్ 1-10) ఆయా పార్టీలకు దక్కిన మొత్తం విరాళాలు రూ. 542.25కోట్లు. మొత్తం 738 బాండ్ల ను వివిధ ఎలక్టోరల్ సంస్థలు, వ్యక్తులు కొనుగోలు చేశారు. ఎస్బీఐ హైదరా బాద్ మెయిన్ బ్రాంచ్‌లో రూ.117 కోట్లు, చెన్నై శాఖ నుంచి రూ.115 కోట్లు విలువజేసే బాండ్లు కొనుగోలు అయ్యాయి. వీటిని నగదుగా మార్చు కోవటం కోసం ఆయా రాజకీయ పార్టీలు ఎస్బీఐలలో ప్రత్యేక ఖాతాల ను తెరిచాయి. బాండ్లను కొనుగోలు చేసిన వ్యక్తుల, సంస్థల పేర్లు ఎస్బీఐ వద్ద ఉన్నప్పటికీ, ఆ వివరాలను మోడీ సర్కార్ రహస్యంగా ఉంచుతోంది.
ఎన్నికల బాండ్ల పథకాన్ని వామపక్షాలు మొదట్నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పథకం చట్ట విరుద్ధమని సీపీఐ(ఎం) సుప్రీంకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేసింది. సా మాజిక కార్యకర్తలు, రాజకీయ పార్టీల నేతలు, ఎన్జీవోలు సైతం బాండ్ల పథకం నిలిపివేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ల విచారణ డిసెంబర్ 6న ధర్మాసనం ముందుకు రాబోతోంది. ఎన్నికల బాండ్ల పథకం తెచ్చాక..ఇప్పటివరకూ వచ్చిన విరాళాల్లో 95శాతం బీజేపీకే వెళ్లాయని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.
ఈ పథకం ద్వారా సమకూరిన వేల కోట్లను వెచ్చిస్తూ.. ఆయా రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ప్రభుత్వా లను బీజేపీ కూల్చుతోందని ఆరోపిం చారు. బాండ్ల ద్వారా వచ్చిన డబ్బుతో నే మహారాష్ట్ర, కర్నాటకలో రాజకీయ కుట్రలకు బీజేపీ తెరలేపిందన్నారు. బాండ్‌ను కొనుగోలు చేసిన దాత పేరును రహస్యంగా ఉంచాలన్న నిబంధనను తొలగించాలని అసోసి యేషన్ ఫర్ డెమాక్రాటిక్ రీఫార్మ్స్ డిమాండ్ చేస్తోంది.