Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోర్బీ విషాదంపై జ్యుడీషియల్ విచారణ
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపు
- కేరళ గవర్నర్ చర్యలకు ఖండన
న్యూఢిల్లీ : ప్రజలపై అసాధారణ రీతిలో మోపుతున్న భారాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యాచరణను బలోపేతం చేయాల సీపీఐ(ఎం) పిలుపి చ్చింది. మోర్బీలో జరిగిన విషాద ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేపట్టాలని కోరింది. కేరళ గవర్నర్ రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించింది. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) కేంద్ర కమిటీ అక్టోబరు 29, 30, 31 తేదీల్లో న్యూఢిల్లీలో సమావేశమై పలు అంశాలపై చర్చించిన అనంతరం ఒక ప్రకటన విడుదల చేసింది.
గుజరాత్‌లోని మోర్బీలో దిగ్భ్రాంతికర సంఘటన
గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో వంతెన కుప్పకూలిన ఘటనలో మృతి చెందిన 140మందికి పైగా కుటుంబాలకు కేంద్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని, సానుభూతిని తెలియచేసింది. ఈ ఘటనలో ఇంకా చాలామంది గాయపడ్డారు. గాయపడిన వారందరికీ తక్షణమే అన్ని రకాల వైద్య సాయం, ఇతరత్రా అన్ని రకాల సాయం అందాలని కమిటీ కోరింది. మరమ్మ తులు చేసిన అనంతరం సరైన భద్రతా ఆడిట్‌ను నిర్వహించకుండానే ఈ వంతెనను తిరిగి ప్రాంభించి నట్లు తెలుస్తోంది. పైగా, ఏ సమయంలోనైనా వంతె నపైకి అనుమతించాల్సిన ప్రజల సంఖ్యను ఉల్లఘిం చి ఎక్కువమందిని అనుమతించినట్టు తెలుస్తోంది. అదీకాక, ఈ తరహా రంగంలో గతంలో ఎలాంటి అనుభవం లేని కంపెనీకి ఈ మరమ్మతుల పనుల కాంట్రాక్టును అప్పచెప్పారు. ఈ అంశాలన్నీ గమనం లోకి తీసుకుంటే, దీనిపై ఉన్నత స్థాయి జ్యుడీషియల్ దర్యాప్తు చేయాల్సిన అవసరం వుంది. ఈ విషాదానికి బాధ్యులెవరో నిర్ధారించాల్సి వుంది.
గవర్నర్ విరుద్ధ చర్యలు
కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేం దుకు పాలక బీజేపీ రాజకీయ లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్ళేందుకు కేరళ గవర్నర్ తీసు కుంటున్న చర్యలను కేంద్ర కమిటీ తీవ్రంగా నిరసిం చింది. కేరళలోని వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్స లర్లను రాజీనామా చేయాల్సి ందిగా ఆయన డిమాండ్ చేసిన తీరు, ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక మంత్రి రాజీ నామాను చేయాలని కోరిన తీరు భారత రాజ్యా ంగంలో అనుమతించనివి, పూర్తి విరుద్ధమైనవి. రాష్ట్రం లోని విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌కు ఇటువంటి చర్యలను చేపట్టడానికి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన విశ్వవిద్యాలయాల చట్టాలు ఎలాంటి అధికారాన్ని ఇవ్వడం లేదు. గవర్నర్ తీసుకుంటున్న ఈ చర్యలు హిందూత్వ సైద్ధా ంతిక ఎజెండాను పెంచి పోషించడానికి వీలు కల్పించేందుకై కేరళ రాష్ట్ర లౌకిక, ప్రజాస్వామ్య, శాస్త్రీయ ఉన్నత విద్యా వ్యవస్థను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇటువంటి లక్ష్యంతోనే జేఎన్‌యూ, హైదరాబాద్ వంటి కేంద్ర విశ్వవిద్యాలయాలతో సహా ఇంకా పలు విశ్వ విద్యాలయాలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. గవర్నర్ చూపిస్తున్న దారుణమైన ఈ పక్షపాతాన్ని కేరళ ప్రజలు సమైక్యంగా ప్రతి ఘటిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు జరుగుతున్న అన్ని ప్రయత్నాలను ఓడిస్తారు.
తమిళనాడు: బీజేపీ అభిప్రాయాన్ని ప్రతిబిం బించేలా గవర్నర్ వ్యక్తపరుస్తున్న అభిప్రాయాలు అనవసరమైన వివాదాలను, గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పాలక డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ఫ్రంట్ ప్రభుత్వ నేతలు ఆరోపించారు. గవర్నర్‌గా వున్న సమయంలో సాంప్ర దాయవాద, విషపూరితమైన ఆలోచనలు చేయడం రాజ్యాంగ ఉల్లంఘనే. ఇటువంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు వ్యతిరేకంగా, భారత రాజ్యాంగ పరిరక్షణలో సమైక్యంగా, కలిసికట్టుగా ఉద్యమిం చాలని అన్ని బీజేపీయేతర లౌకిక ప్రజాస్వామ్య పార్టీలకు ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో నేతృత్వం వహించే ప్రభుత్వాలకు సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.
సమాఖ్యవాదానికి విఘాతం :
మన రాజ్యాంగంలోని ప్రాథమిక అంశమైన సమాఖ్యవాదాన్ని, ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు పెరుగు తున్నాయి. శాంతి భద్రతలనేవి రాష్ట్రానికి సంబంధిం చిన అంశంగా వుంది. పోలీసులకు 'ఒక దేశం ఒక యూనిఫారం' అన్న మోడీ పిలుపు దీన్ని ఉల్లంఘి స్తోంది. ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో తెలంగాణా లో టీఆర్ఎస్ ఎంఎల్ఎలను తమ వైపునకు తిప్పు కునేందుకు పెద్ద మొత్తంలో డబ్బును ఇస్తామంటూ బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.
తీవ్ర సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ
మోడీ ప్రభుత్వ విధానాలు పెరుగుతున్న మాంద్యం ధోరణులతో ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షో భంలోకి నెడుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరాని కి తొలుత నిర్దేశించిన 8.7శాతం అభివృద్ది అంచనా లను వరుసగా మూడోసారి 6.5శాతానికి ప్రపంచ బ్యాంక్ కుదించింది. అలాగే, ఆర్బీఐ 7.8 శాతం నుంచి 7శాతానికి కుదించింది. గత 18 మాసాల్లోనే అత్యంత తక్కువ స్థాయికి పారిశ్రామికాభివృద్ది నమో దైంది. కీలకమైన 8 రంగాలు గతేడాది 19.4శాతం అభివృద్ధిని నమోదు చేయగా ఈసారి 9.8శాతమే నమోదు చేశాయని కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ (అక్టోబరు 12) పేర్కొంది. రూపాయి పతనమైంది. విదేశీ మారక నిల్వలు తరిగిపోతు న్నాయి. వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో పెరుగుతోంది.
ప్రజలపై భరించలేని భారాలు
ముదురుతున్న ఈ ఆర్థిక సంక్షోభం ప్రజల జీవనోపాధులపై తీవ్ర కష్టాలను మోపుతున్నాయి. పండుల సీజనులో కూడా నిరుద్యోగం రేటు 7.8 శాతానికి పెరిగింది. ఇంత జరుగుతున్నా కూడా, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులను విడుదల చేయడానికి మోడీ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఏప్రిల్ 1, అక్టోబరు 21 మధ్య కాలంలో దరఖాస్తు చేసుకున్న దాదాపు కోటీ 50 లక్షల మంది దరఖాస్తుదారులకు పనులు ఇవ్వడానికి తిరస్కరిస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరంలో కోటీ 73లక్షలమందికి పనులు నిరాకరించబడగా, 2021 లో 2.1కోట్ల మందికి పనులు తిరస్కరించారు. దారిద్య్రం పెరుగుతోంది.121 దేశాలతో జారీ చేసిన ప్రపంచ ఆహార సూచీలో భారత్ ర్యాంక్ 107గా వుంది. అంటే పరిస్థితి చాలా తీవ్రంగా వుందని అర్ధమవుతోంది. ఈ కష్టాలన్నింటికి తోడు, వినియోగ దారుల ధరల సూచీ ద్రవ్యోల్బణం ఆర్బిఐ విధించిన గరిష్ట పరిమితి ఆరు శాతాన్ని వరుసగా 9 మాసాలుగా ఉల్లంఘిస్తుండడంతో ధరలు విపరీతం గా పెరుగుతున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం గతంలో ఎన్నడూ లేని రీతిలో అధికంగా వుంది. ప్రాధమిక మనుగడకు అవసరమైన ఆహారమైన పప్పు, గోధుమలు, బియ్యం కూడా మెజారిటీ ప్రజలకు చేరడం లేదు. కేంద్ర గోదాముల్లో ఆహార నిల్వలు గత ఐదేండ్ల కాలంలో ఎన్నడూ లేని స్థాయికి దిగజా రాయి. ఆహార కొరత ప్రమాదాలు పెరుగుతున్నాయి.
పదును తేరుతున్న మత పోకడలు
ప్రజల ఇబ్బందులు, ఆర్థిక వినాశనం కారణంగా తలెత్తుతున్న వారి కష్టాలను నిర్లక్ష్యం చేస్తూ, ప్రజల మధ్య మతపరమైన విభజనలు మరింత పెరిగేలా చేస్తున్న ప్రచారాలకు మోడీ వ్యక్తిగతంగా నాయకత్వం వహిస్తున్నారు. బదరీనాధ్, అయోధ్యల్లో మోడీ పాల్గొంటున్న మతపరమైన కార్యక్రమాలకు మీడియాలో విపరీతమైన స్థానం దక్కుతోంది. ఎప్పటి మాదిరిగానే ఏదో ఒక సాకుతో ముస్లింలు లక్ష్యంగా మారుతున్నారు. ముస్లింలపై చాలా దారుణమైన రీతిలో భౌతిక దాడులు పెరుగు తున్నాయి. విషపూరితమైన విద్వేష వ్యాప్తి, హింసా ప్రచారాలు పెరుగుతున్నాయి. గుజరాత్‌లోని ఖెడా లో ముస్లిం యువతను సాదా దుస్తుల్లో వున్న పోలీసులు బహిరంగంగా కొరడాలతో కొట్టడం తీవ్ర దిగ్భ్రాంతికరమైన అంశంగా వుంది. ఇటువంటి మతపరమైన పోకడలకు వ్యతిరేకంగా విస్తృత రీతిలో లౌకికవాద శక్తులను సమీకరించాలన్న పార్టీ పిలుపును కేంద్ర కమిటీ పునరుద్ఘాటించింది.
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హౌదాలు రద్దు చేసి మూడేండ్లకు పైగా అవుతోంది. ప్రజల ప్రజాస్వామ్య హక్కులపై, వారి జీవనోపాధులపై ఆంక్షలు విధించే పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్ పరిస్థితిపై ఇతర లౌకికవాద పార్టీలతో కలిసి సంప్రదింపుల క్రమాన్ని ప్రారంభించే చొరవను ఇతర వామపక్షాల తో కలిసి సిపిఎం చేపట్టనుంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలు
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ల ఎన్నికల షెడ్యూళ్ల ప్రకటనను ఎన్నికల కమిషన్ డీ లింక్ చేయడంతో గుజరాత్లో ఎన్నికల నిబంధనావళి అమల్లోకి రావడానికి బీజేపీకి మరింత సమయం దొరుకుతోంది. కేంద్ర కోశాగారాన్ని పణంగా పెట్టి మరీ ప్రజలకు కొత్త పథకాలు, ప్రయోజనాలు ప్రకటించడంపై, మతపరమైన పోకడలకు మరింత పదును పెట్టడంపై దృష్టి కేంద్రీకరిస్తున్న బీజేపీ ఎన్నికల ప్రచారాలకు మోడీ వ్యక్తిగతంగా నాయ కత్వం వహిస్తున్నారు. ఈ ప్రభుత్వ పథకాల్లో కొన్నింటిని మోడీ ప్రజలకు ఇస్తున్న 'వ్యక్తిగత దివాళీ బహుమతులు'గా కూడా అభివర్ణిస్తున్నారు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలన్న తన ఉద్దేశ్యాన్ని గుజరాత్ బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్‌లో సీపీఐ(ఎం) 11మంది అభ్యర్ధులను నిలబెట్టింది. ఒక స్థానంలో పోటీ చేస్తున్న సిపిఐకి మద్దతిస్తోంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులను ఓడించాలని సీపీఐ(ఎం) పిలుపి చ్చింది. గుజరాత్లో, ఇంకా ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనందున, బిజెపి ఓటమి ధ్యేయంగా ఇతర లౌకికవాద శక్తులతో కలిసి సీపీఐ(ఎం) చర్చలు జరుపుతోంది.
బ్రెజిల్లో వామపక్ష విజయం
పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో బ్రెజిల్ అధ్యక్షుడిగా లూలా డసిల్వా విజయం సాధించడాన్ని కేంద్ర కమిటీ ప్రశంసించింది. స్వయం ప్రకటిత ఫాసిస్ట్ మితవాదానికి చెందిన జేర్ బోల్సనారో ఓటమి, లాటిన్ అమెరికాలో మరింతగా వామపక్షాల పురోగతిని సూచిస్తుంది. సోషలిస్టు క్యూబాతో పాటూ చిలీ, బొలీవియా, కొలంబియా, పెరూ, హౌండూ రస్ ల్లో వామపక్ష దృక్పథం కలిగిన అధ్యక్షులు ఎన్నికయ్యారు. పొలిట్‌బ్యూరోకి ఎన్నికైన ఎం.వి.గోవిందన్
సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్‌ను పొలిట్‌బ్యూరోకి కేంద్ర కమిటీ ఏకగ్రీవం గా ఎన్నుకుంది.
కేంద్ర కమిటీ పిలుపు
ప్రజలపై మోపుతున్న భారాలపై కార్మిక సంఘాలు, కిసాన్ సభ, వ్యవసాయ కార్మిక సంఘం పిలుపిచ్చిన మేరకు దేశవ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యాచరణకు, నిర్దిష్టంగా 14 అంశాలతో కూడిన డిమాండ్ల పత్రంపై వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పార్లమెంట్‌కు జరిగే ప్రదర్శనకు పార్టీ మద్దతును కేంద్ర కమిటీ ప్రకటించింది. ప్రజల జీవనోపాధులపై పెరుగుతున్న భారాలకు, దళితులు, మహిళలు, సమాజంలో వెనుకబాటుకు గురైన వారిపై పెరుగు తున్న దాడులకు వ్యతిరేకంగా, ప్రజాతంత్ర హక్కు లు, పౌర స్వేచ్ఛలపై జరిగే దాడులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, స్థానికంగా జరిగే పోరాటాలను, నిరసన కార్యాచరణలను బలోపేతం చేయాలని అన్ని పార్టీ శాఖలకు కేంద్ర కమిటీ పిలుపిచ్చింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాలు సక్రమంగా అమలయ్యేలా హామీ కల్పించడంపై ఈ స్థానిక పోరాటాలు దృష్టి పెట్టాలని, వేతనాలు సకాలంలో చెల్లించేలా చూడా లని, డిమాండ్‌కు తగినట్టు గా పనులు కల్పించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చేలా చూడాలని కోరింది.