Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నలు సంధించిన ప్రతిపక్షాలు.. !
గాంధీనగర్ : గుజరాత్‌లోని వంతెన కూలిన ప్రదేశంలో మంగళవారం ప్రధాని మోడీ పర్యటిం చారు. మోర్బీలో ఆదివారం వంతెన కూలిన ఘటన లో 130 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన రెండు రోజుల అనంతరం ఆ ప్రాంతంలో ప్రధాని పర్యటించడం గమనార్హం. అయితే ప్రధాని పర్యటనకు కొన్ని గంటల ముందు.. బ్రిటిష్ కాలం నాటి వంతెనను పునర్నిర్మించిన కంపెనీ హౌర్డింగ్ 'ఒరెవా గ్రూప్'పై తెల్లని ప్లాస్టిక్ కవర్‌ను కప్పివుంచారు. దీంతో ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్లో గత 27 ఏండ్లుగా అధికారం లో ఉన్న బీజేపీపై ప్రతిపక్షాలు ప్రశ్నలను సంధిస్తు న్నాయి.బ్రిడ్జి మరమ్మతు పూర్తయినట్టు కంపెనీ సర్టిఫికేట్ జారీ చేయకుండానే.. షెడ్యూల్ కన్నా ముందు బీజేపీ ప్రభుత్వం బ్రిడ్జీని ఎందుకు ప్రారం భించిందని ప్రశ్నించాయి. పైగా రూ.12నుంచి రూ.17కు టికెట్లను విక్రయించడం గమనార్హం. ప్రముఖ గడియారాల కంపెనీ అజంతాకు చెందిన ఒవెరా గ్రూపుకు మరమ్మతు కాంట్రాక్టు ఎలా ఇచ్చారని ప్రశ్నించాయి. పోలీసులు అరెస్ట్ చేసిన తొమ్మిది మంది కూడా కంపెనీ సిబ్బంది మాత్రమే ననీ, కంపెనీ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకో లేదని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు మోర్బీ పౌర సంస్థతో ఒప్పందం చేసుకున్న ఒరెవా కంపెనీ.. సాంకేతిక సామర్థ్యం లేని చిన్న పాటి కాంట్రాక్ట్ సంస్థ దేవప్రకాష్ సొల్యూషన్స్‌కు అప్పగించినట్టు తెలు స్తోంది. ప్రధాని పర్యటన కోసం స్థానిక ప్రభుత్వాస్ప త్రిని రాత్రికి రాత్రే ముస్తాబు చేయడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బీజేపీ ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహిస్తోందని దుయ్యబట్టాయి. ఆస్పత్రికి రంగులు వేయడం, టైల్స్ అతికించడం, వాటర్ కూలర్లు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ప్రభుత్వ పాలనా తీరుకి ఇది నిదర్శనమని మండిపడ్డాయి.
ప్రధాని సందర్శన కోసం.. అర్థరాత్రి ఆస్పత్రికి అలంకరణ..
గుజరాత్‌లోని మోర్బీ సివిల్ ఆస్పత్రిని అధికారులు రాత్రికి రాత్రే అలంకరణ పనులు చేపట్టారు. మోర్బీ వంతెన ఘటనలో గాయడిన వారికి ఈ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. సోమ వారం రాత్రి ఆస్పత్రిని సందర్శించిన ఓ జాతీయ మీడియా సంస్థ బృందానికి అక్కడి దృశ్యాలు కంటబడ్డాయి. సీలింగ్‌కు పెయింట్లు వేయడం, కొత్త టైల్స్ అతికించడం, కొత్త వాటర్ కూలర్లను ఏర్పాటు చేయడం వంటి పనులు చేపడుతున్నారు. కొత్త బెడ్ షీట్స్‌తో ప్రత్యేక వార్డులోకి గాయపడిన వారిని మార్చడం, ఆస్పత్రి ఆవరణను శుభ్రం చేయిం చడం వంటి దృశ్యాలు కనిపించాయి. దీంతో ప్రధాని ఫొటోషూట్ కోసం ఆస్పత్రిని రెడీ చేయడంలో బీజేపీ అధికారులు బిజీగా ఉన్నారని కాంగ్రెస్, ఆప్‌లు ఎద్దేవా చేశాయి. ప్రధాని సివిల్ ఆస్పత్రిని సందర్శిం చనుండటంతో... ఆస్పత్రి పెయింటింగ్, టైల్స్‌తో మెరిసిపోతుందని.. ప్రధాని ఫోటో షూట్ కోసం అన్ని ఏర్పాట్లు జరుగు తున్నాయని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.