Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన ప్రచారాన్ని ప్రారంభించిన ముత్తూట్ ఫైనాన్స్
కొచ్చి : దేశంలో అతిపెద్ద గోల్డ్ లోన్ ఎన్ బీఎఫ్ సీ కంపెనీ ముత్తూట్ ఫైనాన్స్ తమ సమగ్రమైన మార్కెటింగ్ ప్రచారం ప్రారంభిం చినట్టు వెల్లడించింది. దీనిలో వీరి నూతనమస్కట్ గోల్డ్మన్ కనిపించనున్నారు. ఈ ప్రచారం ద్వారా 'ఫుట్ యువర్ గోల్డ్ టు వర్క్' (మీ బంగారాన్ని సద్వినియోగం చేసుకోండి) అనే సందేశాన్ని అందిస్తున్నారు. తద్వారా వినియోగదారుల విభిన్నమైన రుణావసరాలను తీరుస్తున్నారు. ఈ ప్రచారాన్ని మైత్రి ఎడ్వర్టయిజింగ్ వర్క్స్ రూపొందించింది. దీనిద్వారా ఇంటిలో నిష్ప్రయోజనంగా ఉన్న బంగారాన్ని వినియోగించవచ్చు, సర్వవేళలా బంగారం ఋణాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నది తెలుపుతారు. ఈ ప్రచారాన్ని హాస్యోత్మకంగా తీర్చిదిద్దారు. దీనిలో సుప్రసిద్ధ భారతీయ హాస్యనటులు జానీ ఆంటోనీ, బ్రహ్మానందం, సాధు కోకి, తదితరులు నటించారు. వీరు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ భాషలలో కనిపించనున్నారు.