Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు
- చెన్నైలో ఇద్దరు మృతి
చెన్నై : తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు మంగళవారం కూడా కొనసాగాయి. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదయింది. భారీ వర్షాలకు రాజధాని చెన్నైలో కొన్ని ప్రాంతాలతో పాటు సమీప ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రోడ్లపై భారీ ఎత్తున్న నీరు ప్రవహిస్తుండంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాజధాని చెన్నైతో పాటు అనేక ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్, మంచినీటి సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షాల కారణంగా మంగళవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నైలోని నుంగంబక్కంలో 24 గంటల్లో 8 సెంమీ వర్షం కురిసింది. నవంబర్ 1న ఇంత భారీ వర్షాపాతం నమోదు కావడం 72 ఏళ్లలో ఇది మూడోసారి మాత్రమే. నవంబర్ 1న 1964లో 11 సెంమీలు, 1990లో 8.4 సెంమీలు వర్షపాతం నమోదైంది. చెన్నైలోని పులైనంతోప్లో మంగళవారం గోడ కూలి మీదపడ్డంతో 45 ఏళ్ల శాంతి అనే మహిళ మృతి చెందింది. శాంతి పూలు అమ్ముకుని జీవిస్తుంటుంది. భర్తతో కలిసి అద్దె ఇంట్లో నివస్తుంది. అలాగే, వ్యాసర్పడిలోని బివి కాలనీలో సోమవారం రాత్రి 52 ఏళ్ల దేంద్రన్ విద్యుత్ షాక్తో మరణించారు. ఆటో డ్రైవర్గా పని చేసే దేంద్రన్ తన ఇంటి ముందు ఉన్న విద్యుత్ స్థంభాన్ని ముట్టుకున్నారు.