Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్ బ్రిడ్జి దుర్ఘటన నిందితుని అనుచిత వ్యాఖ్యలు
గాంధీనగర్: గుజరాత్ బ్రిడ్జి ఘటన దేవుని సంకల్పమంటూ నిందితుడు అనుచిత వ్యాఖ్యలు చేశాడు. గుజరాత్ బ్రిడ్జీ ఘటనకు సంబంధించి పోలీసులు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారిలో ఒరేవా కంపెనీ మేనేజర్ దీపక్ పరేఖ్ కూడా ఒకరు. మంగళవారం ఆయనను కోర్టులో హాజరుపరచగా.. దేవుని సంకల్పం కారణంగా ఇటువంటి దురదష్టకర ఘటన జరిగిందని పేర్కొనడం గమనార్హం. బ్రిడ్జీ కేబుల్ తుప్పు పట్టిందని.. మరమ్మత్తుల సమయంలో కంపెనీ దానిని మార్చలేదని మోర్బీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పా జాలా కోర్టుకు తెలిపారు. మరమ్మత్తుల్లో భాగంగా .. వంతెన ప్లాట్‌ఫామ్‌ని మాత్రమే మార్చారని అన్నారు. కానీ తీగలను మార్చకుండా వదిలేశారు. కొత్తగా వేసిన ఫ్లోరింగ్‌ను నాలుగు లేయర్ల అల్యూమినియం షీట్లతో చేశారు. దీంతో పాత తీగలు ఈ బరువు మోయలేక తెగిపోయాయని ఫోరెన్సిక్ నివేదికలో తేలింది. ఇక ఈ మరమ్మతులు చేపట్టిన కాంట్రాక్టర్లకు ఈ పనుల్లో ఎలాంటి 'అర్హత' పత్రాలు లేవు. అయినప్పటికీ 2007లో వీరికే కాంట్రాక్టు అప్పజెప్పారు. మళ్లీ 2022లోనూ వీరినే పిలిపించి మరమ్మతులు చేపించారు. దీని వెనుక కారణాలు తెలుసుకోవాల్సి ఉంది'' అని ప్రాసిక్యూటర్ హెచ్ఎస్ పంచాల్ కోర్టుకు వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో అరెస్టయిన 9 మంది నిందితుల్లో నలుగురిని పోలీసు కస్టడీకి అప్పగించింది. వీరిలో ఒరెవా సంస్థకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు సబ్‌కాంట్రాక్టర్లు ఉన్నారు. మిగతా ఐదుగురికి జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
మరమ్మతులు పూర్తయిన అనంతరం ఒరెవా మేనేజింగ్ డైరెక్టర్ జయసుఖ్ భారు పటేల్ మాట్లాడుతూ.. కనీసం ఎనిమిది నుంచి పదేండ్ల వరకు బ్రిడ్జికి ఎటువంటి ఢోకా లేదని అన్నారు. అయితే ప్రమాదం జరిగి నప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నట్టు స్థానికులు మీడియాకు తెలిపారు. అహ్మదాబాద్‌లోని ఫామ్‌హౌస్‌కు కూడా తాళాలు వేసి ఉన్నాయని.. సెక్యూరిటీ గార్డు కూడా కనిపించడం లేదని అన్నారు. ఒరెవా సంస్థ యజమా నులు, మునిసిపల్ అధికారుల పేర్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేయకపోవడం గమనార్హం. దీనిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ట్విటర్లో స్పందించారు. 'మోర్బీ ఘటన జరిగి మూడు రోజులవుతున్నా.. గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ ఇంతవరకూ సాధారణ ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదం బరం ట్వీట్ చేశారు. ఒరెవా సంస్థ యజమానులు, మున్సిపల్ అధికారుల పేర్లు ఎఫ్ఐఆర్లో ఎందుకు నమోదుచేయలేదని పలు ప్రశ్నలు సంధించారు.