Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చేయండి
న్యూఢిల్లీ : బీసీ కుల గణనపై ఆరు వారాల్లో కౌంటర్ దాఖలు చే యాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. జనగణనతోపాటు కులగణన చేయా లంటూ బీసీ సంఘం నేత, రాజ్యసభ ఎంపీ ఆర్.కష్ణయ్య దాఖలుచేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మా సనం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది కాసోజు మహేశ్ చారి వాదనలు వినిపిస్తూ బీసీ గణన లేకపోవడంతో వారికి పలు రకాలుగా అన్యాయం జరుగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం ఆరు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.