Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం ఆదేశం
న్యూఢిల్లీ : ప్రాంతీయ భాషల్లో చట్టాల ప్రచురణ అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యేందుకుగాను అన్ని చట్టాలను ప్రాంతీయ భాషల్లో ప్రచురించాలనే అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు కోరింది. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రవేశపెట్టడానికి కనీసం 60 రోజుల ముందు అన్ని ముసాయిదా బిల్లులను ప్రభుత్వ వెబ్సైట్, పబ్లిక్ డొమైన్లలో ప్రముఖంగా ప్రచురించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని సుప్రీంకోర్టు న్యాయవాది అశ్విని ఉపాధ్యారు పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ యుయు లలిత్, న్యాయమూర్తి జస్టిస్ బేల ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శకంర్ నారాయణన్ వాదనలు వినిపిస్తూ రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లోని పేర్కొన్న అన్ని ప్రాంతీయ భాషల్లో ముసాయిదా చట్టాలను ప్రచురించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే అనేక నిబంధనలు ఉన్నాయనీ, ఈ పిటిషన్ అవసరం లేదని పేర్కొన్న ధర్మాసనం, ప్రాంతీయ భాషల్లో చట్టాల ప్రచురణకు పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.