Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద వైర్‌పై పోలీసుల విచారణ నిష్పక్షపాతంగా ఉండాలి : ఎడిటర్స్ గిల్డ్
న్యూఢిల్లీ : 'ద వైర్'కు వ్యతిరేకంగా సాగుతున్న విచారణలో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు నియమాలకు కచ్చితంగా పాటించలని 'ద ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' అభిప్రాయపడింది. సున్నితమైన పాత్రి కేయ సమాచారం సమగ్రతను దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఢిల్లీ పోలీసులను కోరింది. జర్నలి స్టుల పని, వార్తా సంస్థ పనికి ఆటంకం కలిగించ కూడదని దర్యాప్తు సంస్థలకు సూచించింది. న్యూస్ వెబ్‌పోర్టల్ 'ద వైర్'పై మోడీ సర్కార్ కక్షసాధింపు చర్యలు తీవ్ర తరమయ్యాయి. న్యూస్ వెబ్‌పోర్టల్ కార్యాలయాలపై ఢిల్లీ పోలీసుల దాడుల అనం తరం.. బెదిరింపులు పెరిగాయి. 'ద వైర్'కు వ్యతి రేకంగా పలు ఫిర్యాదులు రాగా, వీటిపై ఢిల్లీ పోలీ సులు విచారణ చేపట్టారు. ఈ వ్యవహారంపై ఎడి టర్స్ గిల్డ్ స్పందించింది. విచారణ కక్షసాధింపుగా, బెదిరింపుగా ఉండరా దని, నిష్పక్షపాతంగా ఉండా లని తెలిపింది. ప్రజాస్వామ్య సూత్రాలను విస్మరించి బెదిరింపు వ్యూహాలను అమలు చేయరాదని ఢిల్లీ పోలీసులను కోరింది. 'ద వైర్' వ్యవస్థాపక సంపా దకులు, సీనియర్ ఎడిటర్ల ఇండ్లతోపాటు ఢిల్లీలోని వారి కార్యాలయం, న్యూస్ రూమ్‌ల్లో అక్టోబర్ 31న ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ సోదాలు నిర్వహించింది. పోలీసుల తీరు తమను తీవ్రంగా కలవరపర్చిందని ఎడిటర్స్ గిల్డ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నది. ''అక్టోబర్ 29న బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, పార్టీ ఐటీ సెల్ అధినేత అమిత్ మాల్వియా చేసిన ఫిర్యాదుకు ప్రతిస్పందనగా నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం సోదాలు జరిగాయి. వార్తా సంస్థల్లో పోలీసుల వ్యవహారశైలి అతిగా ఉంది'' అని గిల్డ్ అభిప్రాయపడింది. ఈ సోదాలపై 'ద వైర్' తెలిపిన వివరాల ప్రకారం, ''సోదాల సమయంలో జర్నలిస్టుల ఇండ్ల నుండి, అలాగే కార్యాల యం నుండి ఫోన్లు, కంప్యూటర్లు, ఐప్యాడ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జర్నలిస్టుల వ్యక్తిగత, వృత్తికి సంబంధించి సున్నితమైన సమాచారం ఇందులో ఉంది. ఈ సమాచారం ఎంతో ముఖ్యమని అభ్యర్థిం చినా పోలీసులు వినకపోవటం దారుణం. విచారణ నియమాలు, ప్రక్రియను పోలీసులు ఉల్లంఘించా రు. మా వార్తా కథనాలకు సంబంధించి సున్నితమైన సమాచారం గోప్యత కూడా ప్రమాదంలో పడింది'' అని ద వైర్ ఆందోళన వ్యక్తం చేసింది. ఏదేమైనప్పటికీ ద వైర్‌పై ఢిల్లీ పోలీసుల విచారణ నిబంధనల ప్రకారం ఉండాలని గిల్డ్ కోరింది. భయపెట్టే పద్ధతిలో సోదాలు, నిర్బంధాలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపింది.