Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడో స్థానంలో ఏపీ.. ఓవరాల్‌గా తెలంగాణకు 25 వ స్థానం
- కేంద్ర పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం నివేదిక
న్యూఢిల్లీ : విద్యా వ్యవస్థ పనితీరులో కేరళ అగ్రగామిగా నిలిచింది. విద్యా రంగంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 2020-21 సంవత్సరంలో కనబరిచిన పనితీరు గ్రేడింగ్ సూచిక నివేదికను పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని పాఠశాల విద్యా వ్యవస్థ పనితీరును సాక్ష్యం ఆధారిత సమగ్ర విశ్లేషణ ఆధారంగా రూపొందిన ప్రత్యేక సూచికను నివేదికలో పొందుపరిచారు. మొత్తం ఏడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కేరళ, పంజాబ్, చండీగఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ 2020-21లో లెవెల్ 2 (స్కోరు 901-950) ను చేరుకున్నాయి. 2017-18లో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ స్థాయి సాధించాయి. అత్యున్నత స్థాయి సాధించిన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ కొత్తగా స్థానం సాధించాయి. కొత్తగా ఏర్పడిన కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ 2020-21లో ఎనిమిదో స్థానం నుంచి 2021-22లో నాలుగో స్థానంలో నిలిచింది. 928 పాయింట్లతో కేరళ, మహరాష్ట్ర, పంజాబ్ తొలిస్థానంలోనూ, 927 పాయింట్లతో చండీగఢ్ రెండోస్థానంలో 903 పాయింట్లతో గుజరాత్, రాజస్థాన్ మూడోస్థానంలో, ఆంధ్రప్రదేశ్ 1000కు 902 పాయింట్లతో నాలుగోస్థానంలో నిలిచి లెవెల్-2లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌కు లెర్నింగ్ అవుట్‌కమ్, క్వాలిటీలో 180గానూ 154 పాయింట్లు , విద్యార్థుల ఎన్రోల్మెంట్ రేషియో 80గానూ 77, మౌలిక సదుపాయాల్లో 150గానూ 127, సమానత్వంలో 230కి గానూ 210, పాలన యాజమాన్యంలో 360కిగానూ 334 పాయింట్లు దక్కాయని కేంద్రం తెలిపింది. మౌలికసదుపాయాలు, సౌకర్యాలు విభాగంలో 2017-18లో 150గానూ 99 పాయింట్లు వస్తే 2020-21 నాటికి 127 పాయింట్లు మెరుగుపడి లెవెల్ 2 చేరుకోవడానికి దోహదపడింది. పాలనా యాజమాన్యం విభాగంలో 2017-18లో 360కిగానూ 211 పాయింట్లు వస్తే 2020-21నాటికి 334 పాయింట్లు సాధించింది. 2019-20కి 2020-21కి ఓవరాల్‌గా 91 పాయింట్లు వృద్ధి సాధించింది.
25వ స్థానంలో తెలంగాణకు గ్రేడ్-2:
కేంద్ర విద్యా శాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం గురువారం విడుదల చేసిన 2020-21లో విద్యారంగంలో రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు కనబరిచిన పనితీరు గ్రేడింగ్‌లో తెలంగాణ గ్రేడ్ 2 సాధించింది. ఓవరాల్‌గా 25వ స్థానంలో నిలిచింది. 2017-18లో 676 పాయింట్లు, 2018-19లో 757పాయింట్లు, 2019-20లో 772 పాయింట్లు, 2020-21లో 754 పాయింట్లు సాధించినట్లు కేంద్రం తెలిపింది. లెర్నింగ్ అవుట్‌కమ్, క్వాలిటీలో 180గానూ 142 పాయింట్లు , విద్యార్థుల ఎన్రోల్మెంట్ రేషియో 80గానూ 72, మౌలికసదుపాయాల్లో 150గానూ 120, సమానత్వంలో 230కి గానూ 200, పాలన యాజమాన్యంలో 360కిగానూ 220 పాయింట్లు దక్కాయని కేంద్రం తెలిపింది.