Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువత భుజాలపై దేశ భవిష్యత్తు
- దేశ పరిరక్షణకు ఆలోచించండి
- ఉత్తమ భారతదేశాన్ని నిర్మించండి : యువతకు ఏచూరి పిలుపు
- నా ఉద్యోగం ఎక్కడీ నినాదంతో డీవైఎఫ్ఐ పార్లమెంట్ మార్చ్
- కదంతొక్కిన వేలాది మంది యువతీ యువకులు
న్యూఢిల్లీ : అందరికీ విద్యా, అందరికీ ఉద్యోగం కల్పించే వరకు మోడీ సర్కార్‌ను నిద్ర పోనీయొద్దని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపు ఇచ్చారు. దేశ భవిష్యత్తు యువత భుజాలపై ఉన్నదనీ, ఉత్తమ భవిష్యత్తు నిర్మాణానికి ఆలోచనలు చేయాలని సూచించారు. నా ఉద్యోగం ఎక్కడీ అంశంతో పాటు నా దేశాన్ని, నా ఇండియాను రక్షించాలని డీవైఎఫ్ఐ దేశవ్యాప్తంగా యువతను సమాయత్తం చేయాలని పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ''నా ఉద్యోగం ఎక్కడీ అందరికీ ఉద్యోగాలు'' డిమాండ్‌తో డీవైఎఫ్ఐ పార్లమెంట్ మార్చ్ నిర్వహించింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశ నలుమూలల నుంచి వేలాది మంది యువతీ, యువకులు నా ఉద్యోగం ఎక్కడ అంటూ కదంతొక్కారు. వివిధ డిమాండ్లతో కూడిన ప్లకార్డు చేబూని తమ తమ మాతృ భాషల్లో నినాదాల హౌరెత్తించారు. భిన్నత్వంలో ఏకత్వం ప్రస్ఫుటించింది. రాజ్యసభ ఎంపీ, డీవైఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు ఎఎ రహీమ్ అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ మార్చ్‌ను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ దేశ భవిష్యత్తును యువతే నిర్ణయిస్తోందనీ, ఆ యువత డీవైఎఫ్ఐతో ఉన్నదని తెలిపారు. అందువల్ల డీవైఎఫ్ఐ గొంతెను వినకుండా ఏమీ చేయలేరని అన్నారు. ''దేశ, యువత భవిష్యత్తులకు అవినాభావ సంబంధం ఉంది. దేశానికి ఏం కావాలనే మీరు నిర్ణయించాలి. మీరే దేశ భవిష్యత్తు. మీ భవిష్యత్తు. దేశాన్ని ఎలా పరిరక్షించాలనేది మీరు ఆలోచన చేయాలి. అలా పరిరక్షించిన దేశాన్ని డీవైఎఫ్ఐ సృష్టించాలి'' అని పేర్కొన్నారు.
నూతన భారత దేశాన్ని నిర్మించాలి
''నూతన భారత దేశాన్ని నిర్మిం చాలి. కానీ మోడీ దేశాన్ని లూటీ చేస్తు న్నారు. అబద్ధాలను ప్రచారం చేస్తున్నా రు. సాక్షాత్తు ప్రధాని మోడీ దేశంలోని పేదరికాన్ని తరిమికొట్టా మని అబద్ధం ఆడుతున్నారని ఏచూరి విమర్శించా రు. గత రెండేండ్ల లో ప్రపంచ పేదరి కంలో మూడింట రెండు వంతుల మంది భారతదేశానికి చెందినవారే. దేశంలో పేదరికం, ఆకలి సూచి, నిరు ద్యోగం పెరుగుతోంది. మోడీ ప్రభు త్వం ప్రజా, దేశ వ్యతిరేక విధానాల అమలు వేగవంతం చేసింది'' అని వి మర్శించారు. దేశ ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ రంగాన్ని లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగానికి ప్రజలు యజమానులని, ప్రభుత్వం కేవలం మేనేజర్ మాత్రమేనని అన్నా రు. యజమానుల (ప్రజల) అనుమతి లేకుండా ఆస్తులను మేనేజర్ అమ్మేతే, అలాంటి మేనేజర్ (మోడీ సర్కార్)ను గద్దె నుంచి తరిమికొట్టాలని ఏచూరి పిలుపు నిచ్చారు.
దేశాన్ని విభజించేవారిని సాగనంపాలి
గత ఎనిమిదేండ్లుగా మోడీ సర్కార్ దేశాన్ని లూటీ చేస్తుస్తోందనీ, దేశాన్ని (పేదలు, ధనవంతులు) రెండుగా విభజించిందని ధ్వజమెత్తా రు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అను మతించకూడదని ఏచూరి సూచించా రు. దీన్ని అనుమతించకుండా ఉండా లంటే.. మోడీ ప్రభుత్వాన్ని సాగనంపా లని ఆయన పిలుపు నిచ్చారు. ఫలి తంగా దేశాన్ని రక్షించుకోవచ్చని, అలాగే దేశ భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు దేశాన్ని మార్చుకోవాలని మీరంతా ప్రతిజ్ఞ పూనాలన్నారు. దానికోసం దేశం యువత హక్కుల కోసం పోరాడటం అత్యవససరమని పేర్కొన్నారు. ఇదే ప్రత్యామ్నాయమని ఏచూరి స్పష్టం చేశారు.
ప్రజా వ్యయం పెంచడమే ప్రత్యామ్నాయం
కార్పొరేట్లకు రూ.11 లక్షల కోట్లు రుణాలను మాఫీ చేశారని, ఆ మొత్తాన్ని సేకరించి మౌలిక సదుపా యాలు కల్పించాలని ఏచూరి సూచిం చారు. ఆ మొత్తాన్నిఉపయోగించి రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టులు, తాగునీరు లేని అందుబాటులో లేని గ్రామాలకు తీసుకురావడం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రజా పెట్టుబడిని పెంచాలని అన్నా రు. దానివల్ల కోట్లాలో కొత్త ఉద్యోగాలు వస్తాయని, యువత ఉద్యోగాలు వస్తే, మూతబడిన పరిశ్రమలు తిరిగి ప్రారం భం అవుతాయని తెలిపారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుం దని, ఇది తాము చెప్పే ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు.
రాక్షసుడి (మోడీ) చేతుల్లో ఉన్న అమృతాన్ని గుంజుకోవాలి
దేశంలో కార్పొరేట్, మతోన్మాద బంధం అభివృద్ధి చెందుతోందని ఏచూరి విమర్శించారు. ఒక పక్క దేశాన్ని లూటీ చేయడం, మరోపక్క దేశ ఐక్యత, సమగ్రతకు ధ్వంసం చేయడమని ధ్వజమెత్తారు. ఉద్యోగం యువత హక్కు అని, దానికోసం ఉద్యమించాలని పిలుపు ఇచ్చారు. ఉపాధి హామీని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించాలని తాము డిమాండ్ చేస్తున్నామని, కానీ మోడీ సర్కార్ అంగీకరించటం లేదని విమర్శించారు. అదే సమయంలో నిరుద్యోగం పెరిగిం దనీ, గత ఆరు నెలల్లో 1.5 కోట్ల మంది ఉపాధి హామీని బయటకు నెట్టబడ్డారని అన్నారు. ఇది ప్రభుత్వ క్రూర స్వభావమని, ప్రభుత్వ విధాన మని ధ్వజమెత్తారు. మరోవైపు దేశ ప్రజలను మతం పేరుతో విభజిస్తు న్నారని, ద్వేషం, హింసను ప్రేరేపిస్తు న్నారని ధ్వజమెత్తారు. గుజరాత్లో ముస్లీం యువుకులపై పోలీసులు దాడి, యూపీలో బుల్డోజర్ రాజ్ వంటి వి అందుకు ఉదాహరణలని పేర్కొ న్నారు. అమృత్ కాలం వచ్చిందని మోడీ చెబుతున్నారని, కానీ పురా ణాల్లో చెప్పినట్లు అమృతం రాక్షసుల (మోడీ) చేతుల్లో ఉన్నదనీ, దాన్ని యువత, డీవైఎఫ్ఐ గుంజుకోవాలని సూచించారు.
కొత్త ఉద్యోగాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయ్ణి నీలోత్పల్ బసు
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు నీలోత్పల్ బసు మాట్లాడుతూ మోడీ సర్కార్ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని దేశ యువతకు హామీ ఇచ్చారనీ, దాని ప్రకారం 16 కోట్లు ఉద్యోగాలు రావాలని అన్నారు. కానీ మోడీ ఏలుబడిలో కొత్త ఉద్యో గాలు రాకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని విమర్శించారు. మరోవైపు ధరలు పెరుగుదలతో రోజు రోజుకి ప్రజలపై భారాలు అధికమవు తున్నాయని అన్నారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతు న్నాయని విమర్శించారు. దేశం ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అప్పన్నంగా అమ్ముతున్నారని ధ్వజమెత్తారు.
నిరుద్యోగ పెరుగుదలతో యువతపై తీవ్ర ప్రభావ్ణం హిమఘ్నరాజ్ భట్టాచార్య
డీవైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి హిమఘ్నరాజ్ భట్టాచార్య మాట్లాడు తూ దేశంలో నిరుద్యోగ రేటు పెరుగు తోందని, దేశంలోని యువత తీవ్ర ప్ర భావానికి గురవుతున్నారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని, కానీ దేశంలోని యువతకు 6.9 శాతం నిరుద్యోగం బహుమతిగా ఇచ్చిందని ధ్వజమెత్తారు. మరోవైపు కాంట్రాక్టీకర ణ, అవుట్ సోర్సింగ్‌తో శాశ్వత ఉద్యో గాలు లేకుండా చేస్తున్నారని విమర్శిం చారు. ప్రభుత్వం, ప్రభుత్వ రంగం సంస్థల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, దేశ యువతకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న 60 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయా లని డిమాండ్ చేశారు. కొత్త ఉద్యోగా లను సృష్టించేందుకు ఉపాధి హామీని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలనీ, అందుకోసం పట్టణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. యువత వ్యతిరేక అగ్నిపథ్ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ మార్చ్‌లో మీనాక్షి ముఖర్జీ (బెంగాల్), వికె సనోజ్ (కేరళ), నబరున్ దేబ్ (త్రిపుర), ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు విపి సాను, మయూక్ బిశ్వాస్, తిరువనంతపురం మేయర్ ఆర్యా రాజేంద్రన్, తిరుపతి (తెలం గాణ), జి.రామన్న, వై.రాము (ఆంధ్ర ప్రదేశ్)తదితరులు పాల్గొన్నారు.