Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2021-22లో పెరిగిన డ్రాపౌట్లు
- మధ్యలోనే చదువుకు ఫుల్స్టాప్
- గతేడాదితో పోలిస్తే అధికం
- ఏడాదిలో రెట్టింపైన డ్రాపౌట్లు
- కేంద్ర ప్రభుత్వ గణాంకాలు
న్యూఢిల్లీ: దేశంలో స్కూల్ డ్రా పౌట్లు ఆందోళనకరంగా మారుతున్నా యి. ఈ సమస్య ప్రతి ఏడాదీ కనబడు తున్నది. చదువుకోవాల్సిన చిన్నారుల బాల్యం.. అర్ధాంతరంగానే స్కూల్కు ఫుల్స్టాప్ పెడుతున్నారు. చదువుకు దూరమవుతున్నారు. ఇది దేశ అక్షరా స్యతపై ప్రభావం చూపెడుతున్నది. అనేక నివేదికలు, సర్వేలు డ్రాపౌట్ల గురించి ప్రభుత్వాలను హెచ్చరిస్తున్న ప్పటికీ ఈ సమస్య పరిష్కారానికి మాత్రం సమాధానం దొరకటం లేదు. ఎప్పటిలాగే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాదీ భారత్లో స్కూల్ డ్రాపౌట్లు పెరిగాయి. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్ల డించాయి. దీనికి సంబంధించిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడీఐఎస్ఈ) ప్లస్ 2021-22 నివేదికను ఇటీవల విడు దల చేశారు. ఇది పాఠశాల విద్యార్థుల నమోదు, డ్రాపౌట్ రేట్లు, పాఠశా లల్లో ఉపాధ్యాయుల సంఖ్య, మరుగు దొడ్లు, భవనాలు, విద్యుత్ వంటి ఇతర మౌ లిక సదుపాయాల గురించి సమాచా రాన్ని అందించే సమగ్ర అధ్యయనం.
యూడీఐఎస్ఈ నివేదిక ప్రకా రం.. 1 నుంచి 8 తరగతులకు హాజ రయ్యే చిన్నారులు డ్రాపౌట్ రేటు ఏడాది కాలంలో దాదాపు రెట్టింపయ్యింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎక్కువ మంది చిన్నారులు మధ్యలోనే బడి మానేశారు. ప్రాథమిక స్థాయిలో (1 నుంచి 5 తరగతులు) డ్రాపౌట్ రేటు 2020-21లో 0.8శాతం నుంచి 2021-22 విద్యా సంవత్సరం లో 1.5 శాతానికి పెరిగింది. ఎగువ ప్రాథమిక స్థాయిలో (6-8 తరగతు లు), డ్రాపౌట్ రేటు 2020-21 ఏడాదిలో 1.9 శాతంతో పోలిస్తే 2021-22లో మూడు శాతానికి పెరిగింది. నిజానికి ఎగువ ప్రైమరీ స్థాయిలో మూడేండ్లలో డ్రాపౌట్ రేటు అత్యధికం. 2019-20 నివేదిక ప్రకారం డ్రాపౌట్ రేటు 2.6 శాతంగా ఉన్నది. 2021-22లో మళ్లీ మూడు శాతానికి పెరిగింది. మూడేండ్లలో ఈ స్థాయిలో అబ్బాయిల కంటే బాలికల డ్రాపౌట్ రేటు ఎక్కువగా ఉన్నది.
సెకండరీ స్థాయిలో అయితే గత విద్యా సంవత్సరంలో డ్రాపౌట్ రేటు 14.6శాతంతో పోలిస్తే తాజా నివేదిక లో 12.6 శాతానికి తగ్గింది. గతేడాది తో పోలిస్తే ఈ ఏడాది ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో కలిపి 19.63 లక్షల మంది కొత్త విద్యార్థులు చేరారు. 2020-21లో విద్యార్థుల సంఖ్య 25.38 కోట్ల నుంచి 25.57 కోట్లకు పెరిగింది. పాఠశాల వ్యవస్థలోకి 8.19 లక్షలకు పైగా కొత్త బాలికలు వచ్చారు. లింగ సమానత్వ సూచిక (జీపీఐ) గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) పాఠశాల విద్యలో బాలికల ప్రాతినిధ్యానికి అనుగుణంగా ఉన్నది. 2020-21తో పోలిస్తే పాఠశాల విద్యలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత మాధ్యమిక స్థాయిలలో 2021 -22లో జీఈఆర్ మెరుగుపడింది. హయ్యర్ సెకండరీలో జీఈఆర్ 2021-22 ఏడాదికి గానూ 57.6 శాతంగా ఉన్నది. మోడీ ప్రభుత్వ పాలనలో దేశంలో విద్యా వ్యవస్థ తిరోగమన దిశలోకి పయనిస్తున్నదని విద్యావేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆరెస్సెస్ నుంచి వస్తున్న ఆదేశాలతో కేంద్రం నడుచు కోవటంతోనే ఇలాంటి పరిస్థితులు భారత్లో ఏర్పడ్డాయని ఆరోపించారు.