Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ:భారత ఒలింపిక్ అసోసి యేషన్(ఐఓఏ) ఎన్నికలు డిసెంబర్లో జరగ నున్నాయి. డివై చంద్రచూడ్, హిమా కోహ్లిలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఐఓఏ ఎన్నికలను సవరించిన రాజ్యా ంగ నిబందనల ప్రకారం జరి పేందుకు అనుమతించింది. జస్టిస్ రావ్లతో కూడిన ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ డిసెంబర్ 10న ఎన్నికలు నిర్వహించన్నుట్లు తెలిపింది. ఎన్నికల నిర్వహణ సహకరించే జస్టిస్ రావుకు రూ.20లక్షల వేతనాన్ని కూడా ఇవ్వాలని సుప్రీం నిర్ణయించింది. సెప్టెంబర్ 27న స్విట్జర్లాండ్లోని లాసన్నెలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సమావేశంలో పేర్కొన్న విధంగా అక్టోబర్ 10కల్లా ఐఓఏ ముసాయిదా రాజ్యాంగ సవరణ, ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ఇప్పటివరకు జరగని సంగతి తెలిసిందే. ఐఓఏ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశం డిసెంబర్ 5న జరగనుందని, డిసెంబర్ 3కల్లా ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికలకు సంబంధించి తుది రిపోర్టును ఐఓసికి పంపాలని పేర్కొంది. డిసెంబర్లోగా ఐఓఏ ఎన్నికలు జరపకపోతే నిషేధం విధిస్తామని ఐఓసి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనం తాజా ఎన్నికలకు ఆదేశాలు జారీ చేసింది.