Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7.77 శాతానికి ఎగబాకిన వైనం
- అక్టోబరులో 4 నెలల గరిష్ట స్థాయికి : సీఎంఐఈ సమాచారం
న్యూఢిల్లీ : మోడీ పాలనలో దేశ నిరుద్యోగ రేటు తారాస్థాయికి చేరుతున్నది. ఈ ఏడాది అక్టోబరు నెలల ఇది నాలు నెలల గరిష్ట స్థాయికి పెరిగింది. దీంతో నిరుద్యోగం 7.77 శాతానికి చేరింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) సమాచారంలో ఈ విషయం వెల్లడైంది.
సీఎంఐఈ సమాచారం ప్రకారం.. అక్టోబరులో నిరుద్యోగ రేటు పెరుగుదలలో.. గ్రామీణ నిరుద్యోగం సెప్టెంబరులో 5.84 శాతం నుంచి అక్టోబరులో 8.04 శాతానికి పెరిగింది. పట్టణ నిరుద్యోగం 7.21 శాతంగా నమోదైంది. 25 రాష్ట్రాల్లో ఆరు రాష్ట్రాల నిరుద్యోగ రేటు రెండెంకెల్లో నమోదు కావటం గమనార్హం. ఇందులో బీజేపీ పాలిత హర్యానా 31.8 శాతంతో అత్యధిక నిరుద్యోగ రేటును నమోదు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ (30.7 శాతం), జమ్మూకాశ్మీర్ (22.4 శాతం), జార్ఖండ్ (16.5శాతం), బీహార్ (14.5 శాతం), త్రిపుర (10.5 శాతం) లు ఉన్నాయి. మోడీ అనుసరిస్తున్న అస్తవ్యవస్థ విధానాలు దేశ యువతకు శాపంగా మారుతున్నాయనీ, దాని ఫలితంగానే దేశంలో నిరుద్యోగం తాండవిస్తున్నదని నిపుణులు తెలిపారు. 2014 ఎన్నికలకు ముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని మరిచారన్నారు. దేశ యువత దీనిపై కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు.