Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండు దశల్లో ఎన్నికలు
- డిసెంబర్ 1, 5 తేదీల్లో... 8న ఓట్ల లెక్కింపు
న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. రెండు దశల్లో పోలింగ్ జరగనున్నది. ఈ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్ అనూప్ చంద్రపాండే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ను ప్రకటించింది. మొదటి దశ డిసెంబర్ 1, రెండో దశ డిసెంబర్ 5న పోలింగ్ జరగనున్నది. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు చేస్తారు. మొదటి దశలో 89, రెండో దశలో 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 142 జనరల్ కేటగిరీకాగా, 13 ఎస్సీ, 27 ఎస్టీ నియోజక వర్గాలు ఉన్నాయి. 4,90,89,765 మంది జనరల్ ఓటర్లు, 27,943 మంది సర్వీస్ ఓటర్లు, మొత్తం 4,91,17,308 మంది ఓటర్లు ఉన్నారు., అందులో 2,53,36,610 మంది పురుషులు, 2,37,51,738 మహిళలు ఉన్నారు. వికలాంగులు 4,04,802 మంది, 80 ఏండ్ల పైబడిన వృద్ధులు 9,87,999 మంది, వందేం డ్లకు పైబడిన 10,460 మంది, ట్రాన్స్జండర్స్ 1,417 మంది, మొదటి సారి ఓటు హక్కును ఉప యోగించుకుంటున్న వారు 4,61,494 మంది ఉన్నారు. 2017లో 50,128 పోలింగ్ స్టేషన్లు ఉం డగా, ఇప్పుడు 51,782 పోలింగ్ స్టేషన్లకు (3.29 శాతం) పెంచామని ఎన్నికల కమిషనర్లు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను గత నెలలో సీఈసీ ప్రకటించింది. డిసెంబర్ 8న హిమాచల్ ప్రదేశ్తో పాటు గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఓట్ల లెక్కింపు జరగనున్నది. గుజరాత్ రాష్ట్రంలో చివరిసారిగా 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరి గాయి. అప్పుడు 182 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాలను గెలుచుకున్నది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాలను కైవసం చేసుకొని రెండో స్థానానికి పరిమితమైంది. ఈ ఏడాది జరగనున్న గుజరాత్ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు సాగనున్నది.