Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనగర్ : స్థానిక యాపిల్ రైతులకు మద్దతిస్తామని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్), జమ్మూ కాశ్మీర్ కిసాన్ తెహ్రీక్ (జేకేకేటీ)ల సమావేశం పునరుద్ఘాటించింది. ఆ రైతులకు సాయం అందించడంపై ప్రభుత్వ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించింది. ఏఐకేఎస్ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ ధావలె మాట్లాడుతూ, హక్కుల కోసం జమ్మూ కాశ్మీర్ ప్రజలు ముఖ్యంగా రైతులు సాగించే పోరాటాలకు మద్దతిస్తామని చెప్పారు.
గత కొన్నేండ్లుగా వారి హక్కులు ఉల్లంఘించబడు తున్నాయన్నారు. జమ్మూ కాశ్మీర్లో పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక యాపిల్, వరి రైతులు, పాల ఉత్పత్తిదారులు అందరూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ధావలె పేర్కొన్నారు.
వారి సమస్యలు పరిష్కరించబడని పక్షంలో తమ నిరసనలను ఉధృతం చేస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా జరపనున్న ఆందోళనకు మద్దతును సమకూర్చుకునే ప్రయత్నంలో ధావలె కాశ్మీర్లో పర్యటిస్తున్నారు.