Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగ్రవాదికి ఉరిశిక్ష ఖరారు
న్యూఢిల్లీ : 2000 ఎర్రకోటపై దాడి కేసులో ఒక ఉగ్రవాదికి ఉరిశిక్షను సుప్రీంకోర్టు గురువారం ధ్రువీకరించింది. మరణశిక్షను విధిస్తూ తనకు విధించిన తీర్పును పున:సమీక్షించాలంటూ లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. అయితే ఎలక్ట్రానిక్ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్న ఆరిఫ్ చేసిన విజ్ఞప్తిని అంగీకరిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి ఉదరు ఉమేష్ లలిత్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. 'ఎలక్ట్రానిక్ రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలనే ప్రార్థనలను మేము అంగీకరించాం. అతని నేరం రుజువైంది. ఈ కోర్టు తీసుకున్న అభిప్రాయాన్ని మేం ద్రువీకరిస్తున్నాం. రివ్యూ పిటిషన్ను తిరస్క రిస్తున్నాం' అని ధర్మాసనం పేర్కొంది. 2000 డిసెంబరు 22న ఎర్రకోటపై దాడి చేసిన కేసులో ఆరిఫ్ ఒక నిందితుడుగా ఉన్నాడు. ఈ దాడిలో ఇద్దరు ఆర్మీ జవాన్లతో సహా ముగ్గురు మృతి చెందారు.