Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్ము : జమ్ముకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని వాస్తవాధీన రేఖ వద్ద గురువారం భారత్‌లోకి చొరబాటుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదుల్ని సైన్యం కాల్చి చంపింది. ఇందులో ఒక మృత దేహాన్ని భారత సైన్యం స్వాధీనం చేసుకోగా, మిగిలిన రెండు మృతదేహాలను పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన గ్రామస్తులు తీసుకుని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని రక్షణ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ భారత్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని, భారత సైన్యం తిరిగి ఎదురుకాల్పులు చేయగా ముగ్గురు మరణించారని తెలిపారు. ఒక ఉగ్రవాది మృత దేహంతో పాటు రెండు ఎకె-47 రైఫిల్స్, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.