Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్ మాజీ అధికారి బిపి ఆచార్యకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసిన ఆరోపణలపై కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. కార్పొరేషన్లో పనిచేస్తున్న అధికారులపై అభియోగాలు నమోదు చేసే ముందు సీఆర్పీసీ సెక్షన్ 197 కింద ప్రభుత్వ అనుమతి తీసుకొనే అంశంపై వైఖరి తెలియజేయాలని పేర్కొంది. ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, ఆదిత్యనాథ్ దాస్లపై ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను 2019లో తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఈడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను గురువారం సీజేఐ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం విచారించింది.
కార్పొరేషన్లో పనిచేసే అధికారులపై అభియోగాలు నమోదుకు ప్రభుత్వ అనుమతి అవసరమా? ప్రాథమిక దశలోనే కేసు కొట్టివేయొచ్చా అనే అంశాలపై వాదనలు వినిపిస్తామని ఈడి తరపు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు తెలిపారు. ఆయా అధికారులు ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారు? కార్పొరేషన్లో పనిచేసే అధికారులేనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. అధికారులు ఇద్దరూ ఐఏఎస్లేనని, ప్రస్తుతం పదవీ విరమణ పొందారని న్యాయవాది తెలిపారు.