Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెనుతిరిగిన పోలీసులు
గాంధీనగర్ : మోర్బీ ఘటన విచారణ నిమిత్తం గుజరాత్లోని కొందరు పోలీసులు గురువారం ఉదయం ఒరేవా కార్యాలయానికి చేరుకున్నారు. ఆఫీసు లాక్ చేసి ఉండటంతో వెనుతిరిగారు. ఇప్పటివరకు అరెస్టయిన తొమ్మిది మంది సిబ్బంది చేసిన ఆరోపణలను నిర్థారించుకునేందుకు ఇక్కడికి వచ్చామని పోలీస్ వర్గాలు మీడియాకి తెలిపాయి. ఒరేవా కంపెనీ యాజమాన్యం అజంతా పై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఎనిమిదేండ్ల వరకు బ్రిడ్జీకి ఎలాంటి ఢోకాలేదని ప్రారంభ సమయంలో అజంతా మేనేజింగ్ డైరెక్టర్ జేసుఖ్భారు పటేల్ పేర్కొన్నారని.. కానీ ప్రారంభించిన నాలుగురోజులకే కూలిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.