Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఓ మహిళా జర్నలిస్టుపై బీజేపీ నేత శంభాజీ భిడే అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె బిందీ (బొట్టు) ధరించలేదంటూ మాట్లాడేందుకు తిరస్కరించారు. మహారాష్ట్రలోని దక్షిణ ముంబయిలోని రాష్ట్ర సెక్రటేరియట్ మంత్రాలయలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రూపాలి చఖ్నార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలపై వివరణనివ్వాలంటూ శంబాజీకి నోటీసులిచ్చారు. వివరాల ప్రకారం.. శంభాజీ భిడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో బుధవారం ఉదయం భేటీ అయ్యారు. సమావేశ వివరాల గురించి శంభాజీని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. 'నన్ను ప్రశ్నించే ముందు బిందీ (బొట్టు) ధరించాలని తెలి యదా... నీతో మాట్లాడను' అంటూ జర్నలిస్ట్‌పై విరుచుకుపడ్డారు. మహిళలు భారత మాతతో సమానమనీ, ఆమె బిందీ లేకుండా విధవ రూపంలో కని పించకూడదని అన్నారు. శంభాజీ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారికాదు. 2018లో తన తోటలోని మామిడి పండ్లను తిన్న దంపతులకు మగపిల్లలు పుడతారంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.