Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీ పురపాలక ఎన్నికల నగారా మోగింది. వచ్చేనెల 4న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. డిసెంబర్ 7న ఫలితాలు వెల్లడించనున్నట్టు తెలిపింది. ఎంసీడీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ ఏడున విడుదల కాగా, 14 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్టు రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ డా. విజరు దేవ్ తెలిపారు. నేటి నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రానుందని అన్నారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్లో మొత్తం 250 వార్డులుండగా, వీటిలో 42 షెడ్యూల్ కులాలకు కేటాయించారు. 50 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేశారు. 2022 జనవరి 1 నాటికి ఢిల్లీలో 1.46 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నట్టు తెలుస్తున్నది. డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తి చేశామని, పోలింగ్ కేంద్రాలను రీ డ్రా చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఇప్పుడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో 250 వార్డులు ఉంటాయనీ, గతంలో 272 వార్డులు ఉండేవని అన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 68 నియోజకవర్గాల్లో అధికార పరిధిని కలిగి ఉంది.