Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కె రాధాకష్ణన్ చైర్‌పర్సన్‌గా ముగ్గురు సభ్యులు
న్యూఢిల్లీ : ఉన్నత విద్యా సంస్థల అసెస్మెంట్, అక్రిడిటేషన్‌ను బలోపేతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఐఐటీ కాన్పూర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్పర్సన్, ఐఐటీ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మహాపురుష శ్రీమంత శంకరదేవ యూనివర్సిటీ (అసోం) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మృదుల్ హజారికా, ఐఐఎం లక్నో ప్రొఫెసర్ భరత్ భాస్కర్, కేంద్ర విద్యా శాఖ సంయుక్త కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ అసెస్మెంట్, అక్రిడిటేషన్ ప్రక్రియలను బలోపేతం చేయడం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020లో పేర్కొన్న నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ కోసం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయడం వంటివి చేస్తుంది. ఉన్నత విద్యా సంస్థల పనితీరులో నాణ్యతా హామీలో అక్రిడిటేషన్ కీలక పాత్ర పోషిస్తుంది. అక్రిడిటేషన్ అనేది ఉన్నత విద్యా సంస్థలకు సమాచార సమీక్ష ప్రక్రియతో వారి బలాలు, బలహీనతలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.