Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచీ అతి తీవ్ర స్థాయికి సూచిస్తోంది. దీంతో కాలుష్య నివారణకు ఢిల్లీ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల్లో సగం మందికి 'వర్క్ ఫ్రమ్ హోమ్' విధానాన్ని ప్రకటించింది. ప్రయివేటు కార్యాల యాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తే మంచిదని సూచించింది. అటు శని వారం నుండి ప్రాథమిక పాఠశాలలను కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు పర్యావరణ మంత్రి గోపాల్ రారు..కాలుష్య నియంత్రణకు కార్యా చరణ ప్రణాళికను వెల్లడించారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ నాలుగో దశ కా ర్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సమావేశంలో మంత్రి నిర్ణయించారు.