Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు వారాలు ఆమోదయోగ్యం కాదు
- పర్సనల్ లా సంస్కరణలపై పార్లమెంటరీ ప్యానెల్‌ను కోరిన ఐద్వా
న్యూఢిల్లీ : పర్సనల్ చట్టాల్లో సంస్కరణలపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) స్పందించింది. దీనిపై సిబ్బంది, ప్రజాసమస్యలు, చట్టం, న్యాయంపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి లేఖ రాసింది. అభిప్రాయాల కోసం మరింత సమయమివ్వాలని కోరింది. ఇందు కు కమిటీ కేవలం 21 రోజుల సమయాన్ని కేటా యించటంపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ''మోమో రాండం కోసం అడిగే మొత్తం కసరత్తు.. సమస్యపై పని చేస్తున్న వివిధ సంస్థలు, వ్యక్తుల అభిప్రాయా లను పొందటానికి తీవ్రమైన ప్రయత్నం కాదు. ఇది కేవలం లాంఛనప్రాయమని అభిప్రాయాన్ని కలిగి స్తుంది. ఇది అభిప్రాయాలు సేకరించటం, మోమో రాండామును పొందటంలో సీరియస్‌గా ఉంటే, ఈ ప్రయోజనం కోసం కమిటీ చాలా ఎక్కువ సమయం కేటాయించి ఉండేది. అలాంటిది విస్తృత సంస్కరణ ల కోసం మూడు వారాల్లో సూచనలు ఇవ్వచ్చు అనేది ఆమోదయోగ్యం కాదు. ఇది అసంబద్ధం'' అని ఐద్వా లేఖలో పేర్కొన్నది. అలాగే, యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ని నిస్సందేహంగా వ్యతిరేకించింది. ''యూసీసీ ప్రశ్నను మోడీ ప్రభుత్వం సూచిం చిన 21వ లా కమిషన్, ' యూనిఫాం సివిల్ కోడ్ అవసరం కాదు, కోరదగినదీ కాదు' అని స్పష్టం చేసింది. సంబంధిత కమ్యూనిటీతో, ముఖ్యంగా మహిళలతో సంప్రదించి వివిధ పర్సనల్ చట్టాలలో చేసే సంస్కరణలను ఐద్వా సమర్థిస్తంది'' అని పేర్కొన్నది. సమీక్ష కోసం గుర్తించిన కొన్ని అంశాలు అస్పష్టంగా ఉన్నాయని వివరించింది. పర్సనల్ చట్టాలను సంస్కరించటం గురించి ఆలోచన చేస్తు న్నట్టు తెలిపిన కమిటీ.. సంస్కరణకు లోబడి ఉండే ప్రాంతాలను వివరించలేదని ఐద్వా పేర్కొన్నది. ''దీని అర్థం ముస్లిం పర్సనల్ లా, గిరిజన ప్రాంతా లకు సంబంధించిన ఆరో షెడ్యూల్లోని చట్టాలను క్రోడీకరించటం మాత్రమే. కేవలం క్రోడీకరణ మహిళలకు సమాన హక్కులు ఇవ్వదు. ఇందులో భాగమైన సంఘాలతో విస్తృతమైన చర్చల తర్వాత మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ముస్లింలు హిజాబ్ ధరించటానికి వారి ఎంపికను ఎలా లక్ష్యంగా చేసుకున్నారో, ఇది వారి ప్రాథమిక విద్యా హక్కును ఎలా ప్రభావితం చేసిందో మనం చూశాం. అలాగే, విడాకులు తీసుకున్న మహిళల హక్కులను రక్షించ కుండా కేంద్రం ముస్లిం పురుషులను జైళ్లలో ఉంచ టానికి చట్టాన్ని ప్రారంభించింది. ఏకాభిప్రాయంతో సంబంధాలు కలిగి ఉన్న ముస్లిం యువకులు 'లవ్ జిహాద్' కేసులలో లక్ష్యంగా మారి జైలుపాలయ్యారు. ఈ పరిస్థితులలో పర్సనల్ లా ను సమీక్షించాలనే సాకుతో, మెజారిటీ చట్టాలుగా ఉండే ఏకరీతి చట్టా ల ు తీసుకురావటానికి ప్రయత్నం జరుగుతుందని మేము భయపడుతున్నాం. ఇవి మహిళలకు సమాన హక్కులు కల్పించే చట్టాలు కావు. చట్టం ఏకరూపత మహిళలకు గణనీయమైన సమాన హక్కులకు దారి తీయదు. వాస్తవానికి, హిందూ చట్టాలను నకిలీ చేయటం, అన్ని వర్లావారి లింగ పక్షపాతానికి దారి తీయొచ్చు'' అని ఐద్వా పేర్కొన్నది.
వైవాహిక ఆస్తిపై మహిళలకు సమాన హక్కులను నిర్ధారించటానికి ఏమీ చేయలేదని వివరించింది. అలాగే, మత మార్పిడి నిరోధక చట్టాలు, బాల్య వివాహాలు మొదలైన వాటిపై ఐద్వా చర్చించింది. యూసీసీపై తన వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని కమిటీని కోరింది. మూడు వారాల గడువును ఉపసంహరించాలని అభ్యర్థిం చింది. మహిళలకు సంబంధించిన చట్టాలపై గతంలో చేసినట్టుగా దేశవ్యాప్తంగా కేంద్రాలలో విచారణలు జరపాలని కూడా కమిటీని కోరింది.