Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రత నమోదు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో ఆదివారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. తెహ్రీ కేంద్రంగా భూకంపం వచ్చింది. రాజధాని డెహ్రాడూన్తోపాటు ఉత్తరకాశీ, బర్కోట్, తెహ్రీ, ముస్సోరీలలో కూడా భూప్రకంపనలు వచ్చాయి. దీనివల్ల ఎటువంటి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. ఇటీవల కాలంలో హిమాలయ రాష్ట్రాల్లో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తున్నాయి. తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్దగా నష్టం జరగడం లేదు. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం ఉత్తరం వైపుగా కదులుతుండటంతో హిమాలయాల్లో తరుచుగా భూకంపాలు వస్తుంటాయి.