Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసక్తిచూపని ప్రజలు.. పడిపోయిన డిమాండ్
- ఉత్పత్పి ఆపేసిన భారత్ బయోటెక్
న్యూఢిల్లీ : రెండు డోసులు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా వాక్సిన్‌కు డిమాండ్ పడిపోయింది. భారత్‌లో 5కోట్ల కోవాగ్జిన్ డోసుల తుది గడువు దగ్గర పడుతున్నా..వాటిని తీసుకునేవారే లేరని, వ్యాక్సిన్ నిల్వలు భారత్ బయోటెక్ వద్ద పేరుకుపోయి ఉన్నాయని సమాచారం. వ్యాక్సిన్ కొనుగోలు డిమాండ్ పూర్తిగా పడిపోయిందని, తయారీ ఆపేస్తున్నామని ఈ ఏడాది మొదట్లోనే భారత్ బయోటెక్ ప్రకటించింది. 2021లో కరోనా రెండో వేవ్ ఉధృతస్థాయిలో వచ్చాక..వ్యాక్సిన్ వాడకం పెరుగుతుందని కంపెనీ అంచనావేసింది. ఒక ఏడాదిలో దాదాపు 100 కోట్ల డోసులకు సరిపడా వ్యాక్సిన్ తయారుచేయగలమని కంపెనీ ప్రకటించింది. ఆమేరకు ఉత్పత్తి సామర్థ్యం పెంచామని తెలిపింది. ''ప్రస్తుతం భారత్ బయెటెక్ వద్ద 20కోట్లకుపైగా కోవాగ్జిన్ వ్యాక్సిన్ డోసుల నిల్వలున్నాయి. ఇందులో 5కోట్ల డోసులు వాడకానికి సిద్ధం. కానీ బయట మార్కెట్లో డిమాండ్ పూర్తిగా పడిపోయింది. ఉత్పత్తి ఆపేయాలని కంపెనీ ఎప్పుడో నిర్ణయించింది''అని భారత్ బయోటెక్‌కు చెందిన అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ 5కోట్ల డోసుల తుది గడువు త్వరలో ముగియనున్నదని, దీనిపై కంపెనీకి భారీ నష్టం వాటిల్లనున్నదని సమాచారం.