Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుజరాత్లో బీజేపీ ఆఫర్ : ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ : గుజరాత్ ఎన్నికల నుంచి వైదొలగితే ఢిల్లీ మంత్రులపై అభియోగాలు ఎత్తివేస్తామంటూ బీజేపీ ఓ ఆఫర్ ప్రకటించిందని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లకు ఈడీ కేసుల నుంచి విముక్తి కల్పిస్తామనీ, వారిపై అభియోగాలు ఎత్తివేస్తామని చెబుతున్నారని తెలిపారు. కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ ఎన్నికల్లో ఓటమి పాలౌతామని బీజేపీ గ్రహించిందనీ, ఓటమి నుంచి బయటపడేందుకు శత విధాలా యత్నిస్తోందని అన్నారు. దీంతో మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్లపై దాఖలైన కేసులు కల్పితాలని స్పష్టమైందని చెప్పారు.