Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచవ్యాప్తంగా అన్నదాతల ఆందోళన
- ప్రపంచ నాయకులకు 35 కోట్ల మంది రైతుల బహిరంగ లేఖ
ప్రపంచంలో ఆహార భద్రతపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. 35 కోట్ల మంది రైతులకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంఘాలు ఈ విషయంలో స్పందించాయి. ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని ఆవేదన వ్యక్తం చేశాయి. దీనిపై ప్రపంచ నాయకులకు బహిరంగ లేఖను రాశాయి. ప్రభుత్వాలు చిన్న తరహా ఉత్పత్తికి పైనాన్స్ను పెంచి మరింత వైవిధ్యమైన, తక్కువ ఇన్పుట్కు వ్యవసాయానికి మారటాన్ని ప్రోత్సహించకపోతే ప్రపంచ ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని రైతు సంఘాలు హెచ్చరించాయి. ఆహార భద్రత, వాతావరణ, ఆర్థిక అంశాలపై ఈజిప్టులో ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు (కాప్27)లో దేశాధినేతల చర్చల నేపథ్యంలో రైతన్నల లేఖ ప్రాధాన్యతను సంతరించుకున్నది.
న్యూఢిల్లీ : రైతులు, మత్స్యకారులు, పశుపోషకులు, అటవీ ఉత్పత్తిదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 70 నెట్‌వర్క్‌లు, సంస్థలు ఐదు ఖండాల్లోన్ని 35 కోట్ల మంది రైతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వరల్డ్ రూరల్ ఫోరమ్‌తో సహా లేఖపై సంతకం చేశాయి. జోర్డాన్ నుంచి యూకే, భారత్‌కు చెందిన సంస్థలు కూడా సంతకం చేశాయి. '' మేము గ్లోబల్ హీట్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేసినప్పటికీ, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవటానికి ప్రపంచ ఆహార వ్యవస్థ సరిగా లేదు'' అని లేఖ పేర్కొన్నది. కాప్27కి తప్పనిసరిగా ప్రాధాన్యతనివ్వాలి అని వివరించింది.
ఆసియా, ఉప సహారా ఆఫ్రికా వంటి ప్రాంతాలలో వినియోగించే 80శాతం ఆహారాన్ని ఉత్పత్తి చేసే చిన్న ఉత్పత్తిదారులు ప్రపంచ ఆహార భద్రతకు కీలకం. అయినప్పటికీ, వారు 2018లో క్లైమేట్ ఫైనాన్స్ ప్రవాహాలలో 1.7 శాతమే ఉన్నారు. కేవలం వంద కోట్ల రూపాయలు వాతావరణ మార్పులకు అనుగుణంగా వారికి సహాయపడటానికి ఏడాదికి 240 బిలియన్ డాలర్లు (రూ. 19.64 లక్షల కోట్లకు పైగా) అవసరమవుతాయని అంచనా.
2021లో జరిగిన గ్లాస్గో పర్యావరణ సమావేశం (కాప్26)లో, సంపన్న దేశాలు 2025 నాటికి ఏడాదికి 40 బిలియన్ డాలర్లకు అనుగుణంగా మొత్తం నిధులను రెట్టింపు చేయటానికి అంగీకరించాయి. ఇప్పటికీ అది అవసరమైన దానిలో కొంత భాగం మాత్రమే. ''రాబోయే తరాలకు ప్రపంచాన్ని పోషించడాన్ని కొనసాగించటానికి అవసరమైన సమాచారం, వనరులు, శిక్షణను చిన్న స్థాయి ఉత్పత్తిదారులకు కలిగి ఉండేలా వాతావరణ ఫైనాన్స్‌లో భారీ ప్రోత్సాహం అవసరం'' అని 2.5 కోట్ల మంది రైతన్నలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈస్టర్న్ ఆఫ్రికా ఫార్మర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎలిజబెత్ ఎన్సిమదాలా అన్నారు.
కాప్27 ప్రపంచ ఆహార ధరల సంక్షోభం మధ్యలో జరుగుతున్నది. ప్రపంచ ఆహార కొరత ఇంకా లేనప్పటికీ, విపరీతమైన కరవు, వరదలు, వేడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. శాస్త్రవేత్తల ప్రపంచంలోని ప్రధాన బెడ్ బాస్కెట్లలో ఏకకాలంలో పంట వైఫల్యాల ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరించారు.ఇక భారత్‌లోని వేడి పరిస్థితులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. భారత్ ఈ ఏడాది మార్చిలో అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఇది దేశంలో గోధుమ ఉత్పత్తిని 30 లక్షల టన్నులు తగ్గించింది. సెప్టెంబరులో అస్థిరమైన రుతుపవనాలు అనేక రాష్ట్రాలను వరదలతో ముంచెత్తాయయి. వరి కోత ఆలస్యమైంది. నివేదికల ప్రకారం, వాతావరణ సంబంధిత అంతరాయాల కారణంగా ప్రభుత్వ ఏజెన్సీల వద్ద గోధుమలు, బియ్యం నిల్వలు ఐదేండ్ల కనిష్టానికి పడిపోయాయి. ఇది గోధుమల ఎగుమతులను నిషేధించటానికి, విదేశాలకు బియ్యం రవాణాను అరికట్టడానికి భారత్‌ను ప్రేరేపించింది. మారుతున్న వాతావరణంలో ఆహార భద్రతను కాపాడుకోవటానికి మరింత వైవిధ్యమైన, తక్కువ-ఇన్పుట్ ఫుడ్ సిస్టమ్‌లకు మారటం కీలకమని వాతావరణ మార్పుపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ పేర్కొన్నది. మరింత స్థిరమైన, సరసమైన ఆహార వ్యవస్థను నిర్మించటానికి తమతో కలిసి పని చేయాలని ప్రభుత్వాలకు రైతులు పిలుపునిచ్చారు. వాతావరణ చర్చలలో ఆహారం, వ్యవసాయం పక్కదారి పట్టాయి. చిన్న ఉత్పత్తిదారుల ఆందోళనలు విస్మరించబడ్డాయి'' అని వరల్డ్ రూరల్ ఫోరమ్ డైరెక్టర్ లారా లోరెంజో తెలిపారు.