Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొమ్మిది కమిటీల్లో ఒక్కదానికీ దక్కని చోటు
- బీజేపీ, మద్దతు పార్టీలకే చైర్మెన్ పదవులు
న్యూఢిల్లీ :రాజ్యసభ కమిటీల్లో ప్రతిపక్షాలకు షాక్ తగిలింది. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ దన్కర్ తొమ్మిది కమిటీలను పునర్ వ్యవస్థీకరించారు. ఈ మేరకు సోమవారం రాజ్యసభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. అయితే ఈ కమిటీల్లో ఒకదానికి కూడా చైర్మెన్‌గా ప్రతిపక్ష సభ్యులను నియమించలేదు. అన్ని కమిటీలకు బీజేపీ, దానికి మద్దతిచ్చిన పార్టీల సభ్యులనే చైర్మెన్లుగా నియమించారు. ఏడుగురు సభ్యులతో ఏర్పాటైన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సభ్యులుగా టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నియమితులయ్యారు. 15 మంది సభ్యులతో ఏర్పడిన నిబంధనలు (రూల్స్) కమిటీ సభ్యులుగా టీఆర్ఎస్ ఎంపీ బి.పార్థసారథి రెడ్డి, బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్, స్వతంత్ర ఎంపీ ఇళయ రాజా, వైసీపీ ఎంపీ పెరిమాళ్ నత్వాని, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు. బీఏసీ రూల్స్ కమిటీకి చైర్మెన్ గా రాజ్యసభ చైర్మెన్ ధన్ కర్ వ్యవహరిస్తారు. పది మంది సభ్యులతో ఏర్పడిన ఎథిక్స్ కమిటీలో సభ్యులుగా టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు, సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం , వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీకి బీజేపీ ఎంపీ ప్రకాశ్ జవదేకర్ చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. పది మంది సభ్యులతో ఏర్పడిన ప్రివిలేజ్ కమిటీ సభ్యులుగా సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీం, బీజేపీ ఎంపీ జివిఎల్ నరసింహారావు నియమితులయ్యారు. ఈ కమిటీకి చైర్మన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ వ్యవహరిస్తారు.