Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు సుప్రీం కోర్టులో ఉపశమనం లభించింది. మనీలాండరింగ్ కేసులో సోరెన్‌పై దర్యాప్తు చేయాలని కోరుతూ జార్ఖండ్ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు విచారణకు అర్హం కానివని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. ఈ పిల్స్ విచారణకు అర్హమైనవని పేర్కొంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. సోరెన్ అధికారంలో వున్నప్పుడు, బూటకపు కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడి, మైనింగ్ లీజును దక్కించుకున్నారని ఆరోపిస్తూ దానిపై విచారణ జరగాలని ఆ పిల్స్ కోరుతున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పత్రాలను సీల్డ్ కవర్లో పెట్టి ఆందజేయగా హైకోర్టు వాటిని ఆమోదించింది.