Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా స్వీకరణ
న్యూఢిల్లీ: నర్సింగ్ వృత్తితో సమాజానికి విశేష సేవలందించిన విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రి స్టాఫ్ నర్సు మిరియాల ఝాన్సీ రాణి జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అందుకున్నారు. సోమవారం రాష్ట్ర పతి భవన్లో నర్సింగ్ ప్రొఫెష నల్స్ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌ పది ముర్ము చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకొన్నారు. నర్సింగ్ వృత్తిలో ఝాన్సీ రాణి 25 ఏండ్లుగా సేవలందిస్తున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్, బ్లడ్ బ్యాంకింగ్, బేసిక్ లైఫ్ సపోర్టు, అడ్వాన్స్ కార్డి యాక్ లైఫ్ సపోర్టు, మెడిక ల్ ట్రాన్స్ప్రిక్షన్ తది తర విభాగాలో సేవలందించడంతో పాటు నర్సింగ్ శిక్షణ కూడా ఇచ్చే వా రు. కరోనా సమయంలో రోగులకు విశేష సేవలందించారు.