Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు
- ఏపీ ప్రభుత్వం, నారాయణ మెడికల్ కాలేజీ చెరో రూ.2.5 లక్షలు చెల్లించాలి
న్యూఢిల్లీ : ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (ఎఎఫ్ఆర్సీ) సిఫారసులు లేకుండానే సూపర్ సెష్పాలిటీ కోర్సు ఫీజులు పెంచుతూ గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన జీవోను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. విద్యార్థులకు ఏపీ హైకోర్టు 2019లో ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఆరు వారాల్లో ఏపీ ప్రభుత్వం, నారాయణ మెడికల్ కాలేజీ చెరో రూ.2.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ నారాయణ మెడికల్ కాలేజ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారించి హైకోర్టు తీర్పుపై స్టే విధిం చింది. తాజాగా జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ సుధాంశు ధూలియాలతోకూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారించి సోమవారం తీర్పు వెలువరించింది. ఎఎఫ్ఆర్సీ సిఫారసు ల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సెష్పాలిటీ కోర్సుల ఫీజులు పెంచడం సరికాదన్న హైకోర్టు తీర్పును సమర్థించింది. ఎఎఫ్ఆర్సీ సిఫార సుల మేరకే ఫీజులు వసూలు చేయాలని, అంతకన్నా ఎక్కువగా వసూలు చేసిన సొమ్ములు విద్యార్థులకు వెనక్కి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎఎఫ్ఆర్సీ సిఫారసులు లేకుండా ప్రభుత్వం జీవో ఇవ్వడం తప్పని, దానితో లబ్ధి పొందిన కాలేజ్ది కూడా తప్పేనని స్పష్టం చేసింది. ఆరు వారాల్లో రాష్ట్ర ప్రభుత్వం, నారాయణ మెడికల్ కాలేజ్‌లు చెరో రూ.2.5 లక్షలు చొప్పున సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి జమ చేయాలని, ఆ మొత్తాన్ని నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా), సుప్రీం కోర్టు మీడియేషన్, కన్సిలియేషన్ ప్రాజెక్టు కమిటీలకు బదిలీ చేయాలని తీర్పులో పేర్కొంది.