Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీడ్కోలు సభలో సీజేఐ జస్టిస్ యుయు లలిత్
- సంస్థను ప్రజలకు చేరువ చేశార్ణు జస్టిస్ డివై చంద్రచూడ్
న్యూఢిల్లీ: గత రెండు నెలల్లో దాదాపు పది వేల కేసులను పరి ష్కరించినట్టు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్ తెలిపారు. సీజేఐగా నేడు (మంగళ వారం) పదవీ విరమణ చేయనున్న జస్టిస్ యుయు లలిత్‌కు సోమ వారం నాడిక్కడ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు సభ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ లలిత్ మాట్లాడుతూ ''నేను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 8,700 పిటిషన్లు దాఖలు అయ్యా యి. 10,000 కేసులను పరిష్కరిం చాము. లోపాలతో ఉన్న 13,000 కేసులు పరిష్కరించాం'' అని అన్నా రు. ఆగస్టు 27న తాను సిజెఐగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇచ్చిన హామీలను చాలా వరకు నెరవేర్చాన ని అన్నారు. కేసుల లిస్టింగ్‌ను క్రమ బద్ధీకరించడంతోపాటు రాజ్యాంగ ధర్మాసనాలను రోజూ కూర్చోబెట్టడా న్ని తాను కొంత మేరకు సాధించ గలిగానని పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో తాను దాదాపు 37 ఏండ్లుగా ప్రాక్టీస్ చేశాననీ, కానీ ఏకకాలంలో రెండు రాజ్యాంగ ధర్మాసనాలు కూర్చోవడం ఎప్పుడూ చూడలేదనీ, కానీ తాను సీజేఐ అయిన తరువాత ఒకే రోజు మూడు రాజ్యాంగ ధర్మాసనాలు విచారిం చాయని తెలిపారు. లైవ్ స్ట్రీమింగ్‌లో విచారణలు జరిగాయని అన్నారు. ఈ గొప్ప విజయంతో తాను సంతృ ప్తితో వెళ్తున్నానని పేర్కొన్నారు. సీజేఐగా నియమితులైన జస్టిస్ డివై చంద్రచూడ్ మాట్లాడుతూ తన కుటుంబానికి, సీజేఐ లలిత్ కుటుం బానికి మధ్య ఉన్న సుదీర్ఘ అను బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ''నేను చాలా కాలం క్రితం మా కుటుంబాల మధ్య సంబంధాన్ని పంచుకోవాలను కుంటున్నాను. సీజేఐ లలిత్ తండ్రి ముంబయిలోని మా నాన్న ఛాంబర్ లో జూనియర్‌గా పనిచేశారు'' అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. '' సీజేఐ లలిత్ సహకరించేవారు. అతను ఎల్లప్పుడూ సంప్రదింపులు, కరుణతో ఉండేవారు'' అని అన్నారు. సీజేఐ లలిత్ సుప్రీం కోర్టును వలస రాజ్యాల సంస్థ నుంచి ప్రజలకు చేరువయ్యే సంస్థగా మార్చారని పేర్కొన్నారు. అంతకు ముందు సుప్రీం కోర్టులో సెరిమోనియల్ ధర్మాసనం జరిగింది. ఇందులో సీజేఐ జస్టిస్ యుయు లలిత్, సాంప్రదాయం ప్రకారం కాబోయే సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూర్చోన్నారు. ఈ బెంచ్‌లో లలిత్ చివరి డివిజన్ బెంచ్ సభ్యురాలు జస్టిస్ బేల ఎం. త్రివేది కూడా కూర్చోన్నారు. అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మాజీ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్, సుప్రీం కోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు.
సీజేఐగా జస్టిస్ లలిత్ నేడు పదవీ విరమణ
సీజేఐగా జస్టిస్ యుయు లలిత్ నేడు (మంగళవారం) పదవీ విరమణ చేయనున్నారు. అయితే గురునానక్ జయంతి సందర్భంగా నేడు సుప్రీం కోర్టుకు సెలవు కావడంతో సోమవారమే అతని చివరి పని దినం అయింది.