Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్‌పర్సన్‌గా కర్నాటక హైకోర్ట్ సీజే రితు రాజ్ అవస్తీ
న్యూఢిల్లీ : దాదాపు నాలుగేండ్ల తర్వాత కేంద్రం 'లా కమిషన్ ఆఫ్ ఇండియా'ను ఏర్పాటుచేసింది. 22వ న్యాయ కమిషన్ చైర్‌పర్సన్‌గా కర్నాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రితు రాజ్ అవస్తీ నియమితులయ్యారు. ఆగస్టు 2018 నుండి కమిషన్ ఖాళీగా ఉంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.ఎస్.చౌహాన్ కమిషన్ 21వ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఆయన 2018లో రిటైర్ అయ్యాక అప్పట్నుంచీ ఆ పదవిని కేంద్రం భర్తీ చేయలేదు. న్యాయ సంస్కరణలపై పరిశోధన, కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం న్యాయ కమిషన్ ప్రధాన విధి. హిజాబ్ నిషేధం కేసులో తీర్పు వెలువరించిన కర్నాటక హైకోర్టు ధర్మాసనానికి జస్టిస్ అవస్తీ నేతృత్వం వహించారు. హిజాబ్‌ను నిషేధిస్తూ కర్నాటక ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టేసింది.