Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు బాధ్యతలు స్వీకరణ
- సీజేఐగా జస్టిస్ యుయు లలిత్ పదవీ విరమణ
న్యూఢిల్లీ : దేశ 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ డివై చంద్రచూడ్ నేడు (బుధవారం) బాధ్యతలు స్వీకరించనున్నారు. దేశ 49 సీజేఐగా జస్టిస్ యుయు లలిత్ మంగళవారం పదవీ విరమణ చేశారు. దీంతో 50వ సీజేఐగా జస్టిస్ డివై చంద్రచూడ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఆ పదవిలో రెండేండ్ల పాటు (2024 నవంబర్ 10 వరకు) ఉంటారు. 2016 మే 13న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అంతకుముందు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2013 అక్టోబర్ 31 నుంచి సుప్రీంకోర్టుకు నియామకం వరకు బాధ్యతలు చేపట్టారు. ముంబయి హైకోర్టు న్యాయమూర్తి 2000 మార్చి 29 నుంచి అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం వరకు ఉన్నారు. అలాగే మహారాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు.